Share News

అర్చనపై నాలుగేళ్ల నిషేధం

ABN , Publish Date - Mar 19 , 2025 | 05:18 AM

డోప్‌ పరీక్షలో విఫలమైన భారత లాంగ్‌ డిస్టెన్స్‌ రన్నర్‌ అర్చనా జాదవ్‌ (20)పై నాలుగేళ్ల నిషేధం విధించారు. గతేడాది డిసెంబరులో పుణె హాఫ్‌ మారథాన్‌ సందర్భంగా..

అర్చనపై నాలుగేళ్ల నిషేధం

న్యూఢిల్లీ: డోప్‌ పరీక్షలో విఫలమైన భారత లాంగ్‌ డిస్టెన్స్‌ రన్నర్‌ అర్చనా జాదవ్‌ (20)పై నాలుగేళ్ల నిషేధం విధించారు. గతేడాది డిసెంబరులో పుణె హాఫ్‌ మారథాన్‌ సందర్భంగా నిర్వహించిన డోప్‌ పరీక్షలో అర్చన నిషేధిత ఆక్సాన్‌డ్రోలోన్‌ తీసుకున్నట్టు రుజువైంది. అంతేకాదు.. డోప్‌ తీసుకున్నట్టు అర్చన స్వయంగా అంగీకరించింది. దీంతో ఆమె నాలుగేళ్లు ఎలాంటి క్రీడా పోటీల్లో పాల్గొనకుండా నిషేధం విధిస్తున్నట్టు ప్రపంచ అథ్లెట్ల స్వచ్ఛత విభాగం (ఏఐయూ) మంగళవారం ప్రకటించింది. ఈ ఏడాది జనవరి 7 నుంచి నిషేధం అమల్లోకి వస్తుందని తెలిపింది. అర్చన చివరిసారిగా గతేడాది అక్టోబరులో ఢిల్లీ హాఫ్‌ మారథాన్‌ రేసులో పోటీపడింది. ఆ రేసులో నాలుగోస్థానంలో నిలిచింది.

ఇవీ చదవండి:

ధోని గిఫ్ట్‌కు షాకైన అశ్విన్

యుద్ధభూమిని వీడొద్దు: హార్దిక్

ఒక్క వీడియోతో దడ పుట్టిస్తున్న పంత్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 19 , 2025 | 05:18 AM