APL Season 4 Kicks Off: అట్టహాసంగా ఏపీఎల్ ప్రారంభం
ABN , Publish Date - Aug 09 , 2025 | 03:42 AM
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఏపీఎల్ సీజన్ 4 టోర్నీ శుక్రవారం ఇక్కడి ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో
విశాఖపట్నం స్పోర్ట్స్ (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్-4 టోర్నీ శుక్రవారం ఇక్కడి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైంది. కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి కె. రామ్మోహన్‌నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలోని కార్యవర్గం క్రికెటర్లతో ఆటలాడుకున్న నేపథ్యంలో ఏపీఎల్-4 టోర్నీలో కొత్త మార్పులు తీసుకువచ్చి ప్రతిభకు అవకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు. అనంతరం మరో ముఖ్య అతిథి, సినీ నటుడు వెంకటే్‌షతో కలిసి తొలి మ్యాచ్‌లో తలపడుతున్న అమరావతి రాయల్స్-కాకినాడ కింగ్స్ జట్ల ఆటగాళ్లను పరిచయం చేసుకుని అభినందించారు. ప్రారంభ కార్యక్రమంలో ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, కార్యదర్శి సానా సతీశ్, విశాఖ ఎంపీ శ్రీభరత్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, విజయనగరం ఎంపీ అప్పలనాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు చాముండేశ్వర్‌నాథ్, మిథాలీరాజ్ పాల్గొన్నారు.