Alex Carey Century: కేరీ సెంచరీ
ABN , Publish Date - Dec 18 , 2025 | 05:14 AM
సొంత గడ్డపై కీపర్ అలెక్స్ కేరీ (106) శతకంతో చెలరేగాడు. అతడికి ఉస్మాన్ ఖవాజా (82) అర్ధ శతకం తోడవడంతో ఇంగ్లండ్‌తో యాషెస్ మూడో టెస్ట్ తొలి రోజును ఆస్ట్రేలియా గౌరవ ప్రదంగా...
ఆస్ట్రేలియా 326/8
ఇంగ్లండ్‌తో యాషెస్
మూడో టెస్ట్
అడిలైడ్: సొంత గడ్డపై కీపర్ అలెక్స్ కేరీ (106) శతకంతో చెలరేగాడు. అతడికి ఉస్మాన్ ఖవాజా (82) అర్ధ శతకం తోడవడంతో ఇంగ్లండ్‌తో యాషెస్ మూడో టెస్ట్ తొలి రోజును ఆస్ట్రేలియా గౌరవ ప్రదంగా ముగించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు ఓ దశలో 94/4 స్కోరుతో ఇక్కట్లలో పడింది. ఐపీఎల్ మినీ వేలంలో రికార్డ్ స్థాయి ధర దక్కించుకున్న ఆసీస్ స్టార్ బ్యాటర్ గ్రీన్ (0) డకౌటయ్యాడు. అయితే కేరీ, ఖవాజా ఐదో వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకున్నారు. దాంతో బుధవారం ఆట ముగిసే సరికి కంగారూలు ఎనిమిది వికెట్లకు 326 పరుగులు చేశారు. స్టార్క్ (33 బ్యాటింగ్), నాథన్ లయన్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆర్చర్ 3, బ్రైడన్ కార్స్, విల్ జాక్స్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
ఇవీ చదవండి:
Sarfaraz Khan: ఐపీఎల్‌లోకి రీఎంట్రీ.. సర్ఫరాజ్ ఖాన్ ఎమోషనల్ పోస్ట్
పీఎం మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం