Akeeb Nabar: 4 బంతుల్లో 4 వికెట్లు
ABN , Publish Date - Aug 30 , 2025 | 03:35 AM
నార్త్ జోన్ పేసర్ అకీబ్ నబీ దార్ చరిత్ర సృష్టించాడు. దులీప్ ట్రోఫీలో తొలిసారిగా నాలుగు బంతుల్లో నాలుగు..
బెంగళూరు: నార్త్ జోన్ పేసర్ అకీబ్ నబీ దార్ చరిత్ర సృష్టించాడు. దులీప్ ట్రోఫీలో తొలిసారిగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో అతడు హ్యాట్రిక్ కూడా నమోదు చేయడంతో.. కపిల్ దేవ్, సాయిరాజ్ బహుతులే తర్వాత ఈ ఫీట్ సాధించిన మూడో బౌలర్ అయ్యాడు. ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న తొలి క్వార్టర్స్‌లో శుక్రవారం రెండో రోజు అకీబ్ 53వ ఓవర్‌లో చివరి మూడు బంతులకు హ్యాట్రిక్ పూర్తి చేసి 55వ ఓవర్ తొలి బంతికే నాలుగో వికెట్ తీశాడు. మొత్తంగా అతడి ధాటికి (3.1-0-5-5) 8 పరుగుల తేడాతో చివరి 5 వికెట్లు కోల్పోయిన ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 230 రన్స్‌కు ఆలౌటైంది. నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 405 పరుగులు చేయగా.. స్పిన్నర్ మనిశికి ఆరు వికెట్లు దక్కాయి. మరోవైపు రెండో క్వార్టర్స్‌లో డానిష్ మలేవర్ (203 రిటైర్డ్ అవుట్) డబుల్ సెంచరీతో సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 532/4 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. శుక్రవారం ఆట ముగిసే సమయానికి నార్త్ ఈస్ట్‌జోన్ 168/7 స్కోరుతో కష్టాల్లో పడింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..
Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..