Share News

Afghanistan, Zimbabwe : అఫ్ఘాన్‌దే సిరీస్‌

ABN , Publish Date - Jan 07 , 2025 | 04:46 AM

జింబాబ్వేతో రెండో టెస్ట్‌లో అఫ్ఘానిస్థాన్‌ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల ఈ సిరీ్‌సను అఫ్ఘాన్‌ 1-0తో కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్‌

Afghanistan, Zimbabwe : అఫ్ఘాన్‌దే సిరీస్‌

రెండో టెస్ట్‌లో గెలుపు

బులవాయో: జింబాబ్వేతో రెండో టెస్ట్‌లో అఫ్ఘానిస్థాన్‌ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల ఈ సిరీ్‌సను అఫ్ఘాన్‌ 1-0తో కైవసం చేసుకుంది. తొలి మ్యాచ్‌ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. 278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో 205 పరుగులకే కుప్పకూలింది. ఓవర్‌నైట్‌ స్కోరు 205/8తో ఆఖరిరోజైన సోమవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఆతిథ్య జట్టు ఒక్క పరుగు కూడా చేయకుండానే మిగతా రెండు వికెట్లను కోల్పోయింది. రషీద్‌ ఖాన్‌ (7/66) ఏడు వికెట్లతో జింబాబ్వే పతనాన్ని శాసించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 157 రన్స్‌ చేసిన అఫ్ఘాన్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 363 పరుగులు చేసింది. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 243 రన్స్‌ సాధించింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా రషీద్‌, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీ్‌స’గా రహ్మత్‌ షా నిలిచారు.

Updated Date - Jan 07 , 2025 | 04:48 AM