Share News

‘స్విస్‌’ మెయిన్‌ డ్రాకు ఆయుష్‌, శంకర్‌

ABN , Publish Date - Mar 19 , 2025 | 05:08 AM

స్విస్‌ ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత యువ షట్లర్లు ఆయుష్‌ శెట్టి, శంకర్‌ ముత్తుస్వామి సింగిల్స్‌లో మెయిన్‌ డ్రాకు అర్హత సాధించారు...

‘స్విస్‌’ మెయిన్‌ డ్రాకు ఆయుష్‌, శంకర్‌

బాసెల్‌: స్విస్‌ ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత యువ షట్లర్లు ఆయుష్‌ శెట్టి, శంకర్‌ ముత్తుస్వామి సింగిల్స్‌లో మెయిన్‌ డ్రాకు అర్హత సాధించారు. క్వాలిఫయర్స్‌ చివరి రౌండ్లో ఆయుష్‌ 21-12, 21-15తో చోలన్‌ (ఇంగ్లండ్‌)పై, శంకర్‌ 21-7, 21-10తో భారత్‌కే చెందిన తరుణ్‌పై గెలిచారు. దీంతో పురుషుల సింగిల్స్‌ మెయిన్‌ డ్రాలో మొత్తంగా ఆరుగురు భారత షట్లర్లు బరిలో నిలవడం విశేషం. సీనియర్లు కిడాంబి శ్రీకాంత్‌, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌తో పాటు వర్ధమాన షట్లర్లు ప్రియాన్షు రజావత్‌, కిరణ్‌ జార్జ్‌ నేరుగా మెయిన్‌ డ్రా ఆడుతున్నారు. కాగా, ఆరంభ రౌండ్‌లో ప్రణయ్‌తో శ్రీకాంత్‌ అమీతుమీ తేల్చుకోనుండగా.. నిషిమొటోతో ఆయుష్‌, మాగ్నస్‌ జొహాన్నెసెన్‌తో శంకర్‌, రాస్మస్‌ జెమ్‌కెతో కిరణ్‌, టొబియాస్‌తో ప్రియాన్షు తలపడనున్నారు.

ఇవీ చదవండి:

ధోని గిఫ్ట్‌కు షాకైన అశ్విన్

యుద్ధభూమిని వీడొద్దు: హార్దిక్

ఒక్క వీడియోతో దడ పుట్టిస్తున్న పంత్

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 19 , 2025 | 05:08 AM