‘టాప్స్’లో 13 మంది తెలుగు అథ్లెట్లకు చోటు
ABN , Publish Date - Mar 09 , 2025 | 02:49 AM
టార్గెట్ ఒలింపిక్స్ పోడియం పథకం (టాప్స్)లో తెలుగు రాష్ట్రాల నుంచి 13 మంది క్రీడాకారులకు చోటు దక్కింది. కేంద్ర క్రీడాశాఖ ఆధ్వర్యంలో..
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): టార్గెట్ ఒలింపిక్స్ పోడియం పథకం (టాప్స్)లో తెలుగు రాష్ట్రాల నుంచి 13 మంది క్రీడాకారులకు చోటు దక్కింది. కేంద్ర క్రీడాశాఖ ఆధ్వర్యంలో జరిగే టాప్స్‌లో కోర్ బృందంలో 42 మంది, పారా కోర్ గ్రూప్‌లో 52 మంది, డెవలప్‌మెంట్ గ్రూప్‌లో 112 మందికి మొత్తంగా 206 మంది ప్లేయర్లకు చోటు లభించింది. కోర్ గ్రూప్‌లోని క్రీడాకారులకు నెలకు రూ.50 వేలు, డెవలప్‌మెంట్ గ్రూప్ అథ్లెట్లకు నెలకు రూ.25 వేలు చొప్పున ఉపకార వేతనంగా అందనుంది. కోర్ గ్రూప్‌లో ఆంధ్రప్రదేశ్ నుంచి షట్లర్లు సింధు, సాత్విక్ సాయిరాజ్, పుల్లెల గాయత్రి, ఆర్చర్ ధీరజ్, బాక్సర్ నిఖత్ జరీన్, షూటర్ ఇషా సింగ్, టీటీ ప్లేయర్ శ్రీజ ఉన్నారు. డెవలప్‌మెంట్ గ్రూప్‌లో ఏపీ నుంచి ఆర్చర్ జ్యోతి సురేఖ, స్ర్పింటర్ యర్రాజీ జ్యోతి, పారా అథ్లెట్ రొంగలి రవి, తెలంగాణ తరఫున అథ్లెట్ నందిని, పారా అథ్లెట్ జీవాంజి దీప్తి, షూటర్ కెనాన్ చినాయ్‌లకు చోటు దక్కింది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..