Share News

Biryani cooked in drain water: ఛీ.. ఛీ.. ఈ బిర్యానీ తిన్నవారందరూ హాస్పిటల్‌కు పరిగెత్తాల్సిందే..

ABN , Publish Date - Dec 24 , 2025 | 04:56 PM

రోడ్డు పక్కన తక్కువ ధరకే అమ్మే ఆహారాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే. స్ట్రీట్‌ ఫుడ్స్‌ విషయంలో శుభ్రతను అసలు ఊహించనే కూడదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే బయట తినాలంటేనే అసహ్యం వేస్తుంది.

Biryani cooked in drain water: ఛీ.. ఛీ.. ఈ బిర్యానీ తిన్నవారందరూ హాస్పిటల్‌కు పరిగెత్తాల్సిందే..
biryani cooked in drain water

మనదేశంలో అత్యధిక మందికి ఫేవరెట్ ఫుడ్ బిర్యానీ. వారానికి ఒకసారైనా రెస్టారెంట్లకు వెళ్లి బిర్యానీ తినేవాళ్లు చాలా మంది ఉంటారు. హోటళ్లు, రెస్టారెంట్లలో బిర్యానీ ఎలా తయారు చేస్తోరో మనకు తెలియదు గానీ, రోడ్డు పక్కన తక్కువ ధరకే అమ్మే ఆహారాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే. స్ట్రీట్‌ ఫుడ్స్‌ విషయంలో శుభ్రతను అసలు ఊహించనే కూడదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే బయట తినాలంటేనే అసహ్యం వేస్తుంది (unhygienic biryani video).


@Maailah1712 అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి రోడ్డు పక్కన బిర్యానీ అమ్ముతున్నాడు. అతడి పక్కనే ఓ కాలువ గుండా మురికి నీరు ప్రవహిస్తోంది. ఆ వ్యక్తి అప్పుడప్పుడు ఆ మురికి నీటిని తీసుకుని బిర్యానీలో వేసి దానిని వేడి చేస్తున్నాడు. అది గమనించిన ఓ వ్యక్తి అతడిని హెచ్చరించాడు. 'ఏయ్ బ్రదర్, నువ్వు మురుగు నీళ్లు బిర్యానీలో చల్లుతున్నావ్' అని హెచ్చరించాడు (biryani controversy).


ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు (dirty food practices). ఆ వీడియో బిర్యానీ ప్రియులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 2.2 లక్షల మంది వీక్షించారు. 1.5 వేల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై తమ స్పందనలను తెలియజేశారు. ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే తినడం ఆరోగ్యానికి మంచిందని అని ఒకరు కామెంట్ చేశారు. స్ట్రీట్ ఫుడ్‌కు ఎంత దూరంగా ఉంటే ఆరోగ్యం అంత బాగుంటుందని మరొకరు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

వామ్మో.. మొసలికి ఎంత కోపం వచ్చిందో చూడండి.. ఒళ్లు జలధరించే వీడియో..


మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ ఫొటోలో పిల్లి ఎక్కడుందో 7 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 24 , 2025 | 04:57 PM