Girl Friend and Boy friend: మూడేళ్లుగా ప్రియుడితో సహజీవనం.. ఫన్నీ సీక్రెట్ తెలిసి గర్ల్‌ఫ్రెండ్ షాక్..
ABN , Publish Date - Aug 13 , 2025 | 06:44 PM
వారిద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మూడేళ్లుగా కలిసి జీవిస్తున్నారు. ఒకే ఇంట్లో కలిసి నివసిస్తున్నారు. ఉద్యోగస్తులైన ఆ ఇద్దరూ ఆ ఇంటి అద్దెను చెరి సగం కడుతున్నారు. ఇంటి ఖర్చులను కూడా సమంగా పంచుకుంటున్నారు. అలా మూడేళ్లుగా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా కలిసి సహజీవనం చేస్తున్నారు.
వారిద్దరూ నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మూడేళ్లుగా కలిసి జీవిస్తున్నారు. ఒకే ఇంట్లో కలిసి నివసిస్తున్నారు. ఉద్యోగస్తులైన ఆ ఇద్దరూ ఆ ఇంటి అద్దెను (Rent) చెరి సగం కడుతున్నారు. ఇంటి ఖర్చులను కూడా సమంగా పంచుకుంటున్నారు. అలా మూడేళ్లుగా ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా కలిసి సహజీవనం చేస్తున్నారు. మూడేళ్ల తర్వాత ఇటీవల ఆమెకు (Girl Friend) ఓ షాకింగ్ విషయం తెలిసింది. దానిని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెటిజన్లు నవ్వుకుంటున్నారు.
ghantaa అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేసిన ఆ పోస్ట్‌లో ఓ మహిళ షేర్ చేసిన స్క్రీన్ షాట్ కనబడుతోంది. ఆ స్క్రీన్ షాట్‌లో.. 'నేను దాదాపు 3 సంవత్సరాలుగా నా బాయ్‌ఫ్రెండ్ తో కలిసి ఒకే అపార్ట్ మెంట్‌లో నివసిస్తున్నా. ఇద్దరం అపార్ట్‌మెంట్ అద్దెను సగం సగం కడుతున్నాము. నెలకు ఒక్కొక్కరు 500 డాలర్లు చొప్పున కడుతున్నాం. ఆ అపార్ట్‌మెంట్ అతనిదేనని నిన్న నాకు తెలిసింది' అంటూ ఆ యువతి స్క్రీన్ షాట్‌ను షేర్ చేసింది (Funny Post).
ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది. దాదాపు ఐదు లక్షల మంది ఆ పోస్ట్‌ను వీక్షించారు. 34 వేల కంటే ఎక్కువ మంది ఆ పోస్ట్‌ను లైక్ చేసి ఫన్నీ కామెంట్లు చేశారు. అతడు మార్వాడీ బాయ్‌ఫ్రెండ్‌లా ఉన్నాడని ఒకరు కామెంట్ చేశారు. అతడు సరైన పనే చేశాడని మరొకరు పేర్కొన్నారు. ప్రేమ ప్రేమే.. వ్యాపారం వ్యాపారమే అంటూ మరొకరు సరదాగా కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
ఈ గడ్డిలో పురుగు కనబడిందా.. మీ కళ్లకు ఇక తిరుగులేనట్టే..
పనిలో పడి కొడుకును పట్టించుకోలేదు.. చివరకు ఏం జరిగిందో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..