Share News

Puzzle: మీ తెలివికి సవాల్.. నలుగురిలో ఎవరు తెలివితక్కువ మూర్ఖుడో 5 సెకెన్లలో కనిపెట్టండి..

ABN , Publish Date - Jan 27 , 2025 | 09:00 PM

ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.

Puzzle: మీ తెలివికి సవాల్.. నలుగురిలో ఎవరు తెలివితక్కువ మూర్ఖుడో 5 సెకెన్లలో  కనిపెట్టండి..
Picture Puzzle

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.


వైరల్ అవుతున్న పై ఫొటో మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని టెస్ట్‌ చేసే పజిల్. ఆ ఫొటోలో కొందరు వ్యక్తులు చెట్ల మీద కూర్చున్నారు. ఆ నలుగురి చేతుల్లోనూ రంపాలు ఉన్నాయి. వారందరూ ఆ రంపాలతో చెట్టు కొమ్మలను కోస్తున్నారు. అయితే వారిలో ఓ తెలివి తక్కువ మూర్ఖుడు ఉన్నాడు. ఆ మూర్ఖుడు ఎవరో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. 5 సెకెన్ల వ్యవధిలో ఆ వ్యక్తిని కనిపెట్టగలిగితే మీ పరిశీలనా శక్తికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేయడంలో పజిల్స్ కీలక పాత్ర పోషిస్తాయి.


సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది. చాలా తక్కువ మంది మాత్రమే 5 సెకెన్ల వ్యవధిలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయగలిగారు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? ఈ కింది ఫొటో చూడండి.. ``ఎ`` అనే వ్యక్తి తన కూర్చున్న కొమ్మను రంపంతో కోసేస్తున్నాడు.

puzzle4.jpg

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jan 27 , 2025 | 09:00 PM