Share News

House on truck: వార్నీ.. ఇదెక్కడి టెక్నాలజీ నాయనా.. ఇంటిని ఎలా తీసుకెళ్తున్నారో చూడండి..

ABN , Publish Date - Dec 19 , 2025 | 03:41 PM

తాజాగా న్యూజిలాండ్‌లో చిత్రీకరించిన ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ ఇంటిని ట్రక్కు మీద వేసుకుని ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్తున్నారు.

House on truck: వార్నీ.. ఇదెక్కడి టెక్నాలజీ నాయనా.. ఇంటిని ఎలా తీసుకెళ్తున్నారో చూడండి..
man moves house on truck

సోషల్ మీడియా ప్రపంచం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. వినోదాత్మక, ఆకర్షణీయ, వినూత్న వీడియోలు నెటిజన్లను ఆకర్షించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఆ వీడియోలు సోషల్ మీడియా జనాలను విపరీతంగా ఆకట్టుకుని బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా న్యూజిలాండ్‌లో చిత్రీకరించిన ఓ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది (man moves house on truck).


hey_itspriyanka అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ ఇంటిని ట్రక్కు మీద వేసుకుని ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్తున్నారు. న్యూజిలాండ్‌లో చాలా ఇళ్లను చెక్కతో కడతారు. అవి చాలా తేలికగా ఉంటాయి. అలాగే చాలా దృఢంగా కూడా ఉంటాయి. వాటిని ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లే వీలు ఉంటుంది. ఇలా ఇళ్లను ట్రక్కుల మీద వేసుకుని తరలించడం న్యూజిలాండ్‌లో తరచుగా కనిపించే విషయమే. అయితే ఇతర దేశాల వారికి మాత్రం ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది (house transported on highway).


న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్ వంటి ప్రధాన నగరాల్లో భూమి ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి (shocking viral video). ఎవరైనా తమ స్థలంలో కొత్తగా ఇల్లు కట్టాలనుకుంటున్నప్పుడు పాత ఇంటిని కూల్చివేసే బదులు, దానిని అమ్మి కొనుగోలుదారునికి ట్రక్కులో పంపుతారు. ఈ పద్ధతి వల్ల తక్కువ పర్యావరణ నష్టం జరుగుతుంది. న్యూజిలాండ్ ప్రకృతికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. అందుకే న్యూజిలాండ్‌లో చాలా మంది చెక్క ఇళ్లను కట్టుకోవడానికే ఆసక్తి చూపుతారు. న్యూజిలాండ్‌లో పాత ఇళ్లను కూలగొట్టి, కొత్తవి కట్టుకోవడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది.


ఇవి కూడా చదవండి..

హోటల్లో ప్రియుడితో భార్య.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని కన్నీరు పెట్టుకున్న భర్త..


మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ 36ల మధ్యలో 63 ఎక్కడుందో 7 సెకెన్లలో కనిపెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Dec 19 , 2025 | 03:58 PM