Japan: జులై 5న ఏం జరగబోతోంది.. జపనీయుల భయానికి కారణమేంటి.. ఆ జ్యోతీష్యం నిజమైతే..
ABN , Publish Date - Jul 02 , 2025 | 07:25 PM
జపనీస్ బాబా వాంగగా ప్రసిద్ధి చెందిన రియో టాట్సుకి కూడా భవిష్యత్తును సరిగ్గానే ఊహించగలదని చాలా మంది నమ్ముతారు. ఆమె 2025 జులై నెల గురించి చెప్పిన ఓ వార్తతో ఆ దేశ పర్యాటక రంగం కుదేలైంది. ఆ అంచనా నిజం కాదని జపాన్ అధికారులు చెబుతున్నప్పటికీ చాలా మంది మాత్రం టాట్సుకీ మాటలనే నమ్ముతున్నారు.
బల్గేరియా దేశానికి చెందిన ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని బాబా వాంగ (Baba Vanga) జ్యోతీష్యం గురించి తెలిసిందే. ఆమె ఊహించిన ఎన్నో భయంకర ఉత్పాతాలు నిజంగానే జరిగాయి. జపనీస్ బాబా వాంగగా ప్రసిద్ధి చెందిన రియో టాట్సుకి (Ryo Tatsuki) కూడా భవిష్యత్తును సరిగ్గానే ఊహించగలదని చాలా మంది నమ్ముతారు. ఆమె 2025 జులై నెల గురించి చెప్పిన ఓ వార్తతో జపాన్ (Japan) పర్యాటక రంగం కుదేలైంది. ఆ అంచనా నిజం కాదని జపాన్ అధికారులు చెబుతున్నప్పటికీ చాలా మంది మాత్రం టాట్సుకీ మాటలనే నమ్ముతున్నారు.
రియో టాట్సుకి రచించిన 'ది ఫ్యూచర్ ఐ సా' అనే పుస్తకమే జపాన్ పర్యాటకానికి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. 2025, జులై 5వ తేదీన జపాన్‌లో ఓ భారీ సునామీ వస్తుందని, దాంతో జపాన్ నగరాలు మునిగిపోతాయని ఆమె పేర్కొన్నారు. నీటి అడుగున సంభవించే పేలుడు, అగ్నిపర్వత విస్ఫోటనం దీనికి కారణం కావచ్చని ఆమె ఊహించారు.
ఈ ప్రళయం 2011లో విధ్వంసం సృష్టించిన సునామీ కన్నా భారీగా ఉంటుందని, జపాన్ దక్షిణ తీరంపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. 2011 నాటి భారీ భూకంపం, సునామీని కూడా టాట్సుకీ ముందుగానే ఊహించి హెచ్చరించారు (Japan Tsunami 2025 Prediction).

జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య సముద్రం మరుగుతున్నట్టు, భారీ బుడగలు ఏర్పడుతున్నట్టు ఆమె ఆ పుస్తకంలో పేర్కొన్నారు. టాట్సుకీ అంచనాలు పర్యాటకులు, జపనీయుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. టాట్సుకి అంచనాల కారణంగా జపాన్‌కు వచ్చే విమాన బుకింగ్‌లు భారీగా రద్దయ్యాయి. జూన్ చివరి, జూలై తొలి వారాల్లో హాంకాంగ్ నుంచి జపాన్‌కు విమాన రిజర్వేషన్లు 83 శాతం పడిపోయాయట. దీంతో జపాన్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. టాట్సుకీ అంచనాల మేరకు ఆ ఉత్పాతం జరిగినా, జరగకపోయినా, ఇప్పటికే జపాన్ పర్యాటక రంగం మాత్రం భారీ విపత్తును ఎదుర్కొంటోంది.
ఇవి కూడా చదవండి..
ఈ క్రియేటివిటీ చూస్తే కళ్లు తిరగడం ఖాయం.. స్కూటీ ఎంత వేగంగా వెనక్కు వెళ్తోందో చూడండి..
మీది డేగ చూపు అయితే.. ఈ బెడ్రూమ్‌లో టూత్‌బ్రష్ ఎక్కడుందో 5 సెకెన్లలో కనిపెట్టండి..
ఈ రూ.500 నోటు విలువ ఐదు వందలు కాదు.. దీనికి ఎంత డిమాండ్ ఉందంటే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..