Share News

Ex Indian Navy Captain: హాలీవుడ్ యాక్షన్ సీన్‌ను తలపించేలా ఫొటో షూట్.. వైరల్‌గా మారిన వీడియో..

ABN , Publish Date - Dec 01 , 2025 | 09:19 PM

కెప్టెన్ నవ్ ‌తేజ్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. 20 వేల అడుగుల ఎత్తులో విమానంలో ఎగురుతూ ఫొటోలు తీసినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సైతం ఆయన షేర్ చేశారు.

Ex Indian Navy Captain: హాలీవుడ్ యాక్షన్ సీన్‌ను తలపించేలా ఫొటో షూట్.. వైరల్‌గా మారిన వీడియో..
Ex Indian Navy Captain

ఓ మాజీ ఇండియన్ నేవీ అధికారి హాలీవుడ్ లెవెల్‌లో యాక్షన్ సీన్‌కు తెర తీశారు. 20 వేల అడుగుల ఎత్తులో విమానంలో ఎగురుతూ ఫొటోలు తీశారు. ఆ ఫొటోలు తీయడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. కెప్టెన్ నవ్ ‌తేజ్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో .. ‘300 నాట్స్ దగ్గర.. 10 వేల నుంచి 20 వేల అడుగుల ఎత్తులో విమానం తలుపు తెరిస్తే మీరు ఫొటోగ్రాఫర్ అన్న సంగతి మర్చిపోవాల్సిందే. తుపానులో కొట్టుమిట్టాడుతున్న మాంసపు ముక్కలా పరిస్థితి ఉంటుంది.


గాలి మిమ్మల్ని తాకటం మాత్రమే కాదు.. ముఖంపై కొడుతుంది కూడా. చర్మాన్ని ఒలిచేస్తున్నట్లు అనిపిస్తుంది. చూడ్డం కష్టం అవుతుంది. ఊపిరి సరిగా తీసుకోలేము. అయినా ఎంతో కష్టపడి ఫొటో తీయాలి. గాలి మిమ్మల్ని వెనక్కు తోస్తుంటే.. మీరు తీసే షాట్స్ ముందుకు తోస్తాయి’ అని రాసుకొచ్చారు. ఆ పోస్టులో గాల్లో ఫొటో తీయడానికి ఆయన చేసిన యుద్దానికి సంబంధించిన వీడియోను సైతం షేర్ చేశారు. ఆ వీడియోలో.. ఒక ఫొటో తీయడానికి ఆయన ఎంతో కష్టపడుతూ ఉన్నారు.


ఇక ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘హాలీవుడ్ సినిమాలో యాక్షన్ సీన్‌ను చూస్తున్నట్లే ఉంది. గూస్‌బమ్స్ వస్తున్నాయి’..‘మిషన్ ఇంపాజిబుల్ సినిమాలో హీరో అచ్చం ఇలానే విమానం మీద స్టంట్లు చేస్తూ ఉంటాడు’..‘అంత గాలి పెడుతున్నా కూడా మీరు చాలా ధైర్యంగా అక్కడ నిలబడి ఉన్నారు. మీరు చాలా గ్రేట్’ అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు.


ఇవి కూడా చదవండి

ఈ మూడు విషయాలపై కోపం సరికాదు

ఎస్ఐఆర్‌పై చర్చకు మాకు కొంత సమయం కావాలి

Updated Date - Dec 01 , 2025 | 09:53 PM