chewing gum accident: మీ పిల్లలు చూయింగ్ గమ్ తింటున్నారా? ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
ABN , Publish Date - Sep 23 , 2025 | 01:18 PM
ప్రస్తుతం చాలా మంది చూయింగ్ గమ్‌లు నములుతుండడాన్ని చూస్తేనే ఉంటాం. పెద్దలైతే ఫర్వాలేదు కానీ, పిల్లలు మాత్రం వాటి జోలికి వెళ్లకూడదు. ఏమాత్రం తేడా వచ్చినా ప్రాణాపాయ పరిస్థితి తలెత్తవచ్చు. తాజాగా కేరళలోని కన్నూర్ నుంచి ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది.
ప్రస్తుతం చాలా మంది చూయింగ్ గమ్‌లు నములుతుండడాన్ని చూస్తూ ఉంటాం. పెద్దలైతే ఫర్వాలేదు కానీ, పిల్లలు మాత్రం వాటి జోలికి వెళ్లకూడదు. ఏమాత్రం తేడా వచ్చినా ప్రాణాపాయ పరిస్థితి తలెత్తవచ్చు. తాజాగా కేరళలోని కన్నూర్ నుంచి ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ బాలిక సైకిల్ తొక్కుతుండగా ఆమె గొంతులో చూయింగ్ గమ్ ఇరుక్కుపోయింది. ఆ బాలిక తీవ్ర ఇబ్బంది పడుతున్న సమయంలో కొందరు యువకులు ముందుకొచ్చి ఆమెను కాపాడారు. ఆ ఘటన సీసీటీవీలో రికార్డ్ అయింది (girl chokes on gum).
Gabbar0099 అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ బాలిక రోడ్డు పక్కన సైకిల్ ఆపి నిలబడి ఉంది (child choking rescue). ఆమె చాలా అసౌకర్యంగా ఫీలవుతోంది. వెంటనే ఆమె సైకిల్‌తో పాటు పక్కనే ఉన్న యువకుల దగ్గరకు వెళ్లింది. గొంతులో చూయింగ్ గమ్ ఇరుక్కుపోయిందని, ఊపిరి ఆడడం లేదని చెప్పింది. వెంటనే అప్రమత్తమైన యువకులు ఆ బాలిక తలను కిందకు వచ్చి, వీపు మీద పలుసార్లు తట్టారు. దీంతో ఆమె గొంతులో నుంచి చూయింగ్ గమ్ బయటకు వచ్చేసింది (bystanders save girl).
ఆ ఘటన మొత్తం అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది (choking first aid). ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేల మంది ఆ వీడియోను వీక్షించి తమ స్పందనలను తెలియజేశారు. ఆ అమ్మాయి సరైన సమయంలో ఈ వ్యక్తుల వద్దకు వెళ్లకపోతే, ఏమి జరిగి ఉండేదోనని ఒకరు ఆందోళన వ్యక్తం చేశారు (viral rescue video). మనం వారందరినీ ఎంత ప్రశంసించినా తక్కువేనని మరొకరు పేర్కొన్నారు. చిన్న పిల్లలు చూయింగ్ గమ్ నమలడం ఎంత ప్రమాదకరమో ఇప్పటికైనా అర్థం చేసుకోండని మరొకరు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి..
పాకిస్థాన్‌లో ఐఫోన్ రేటెంతో తెలిస్తే కళ్లు తేలెయ్యాల్సిందే.. కిడ్నీ అమ్మినా కుదరదేమో..
మీ కళ్లకు పవర్ ఉంటే.. ఈ అడవిలో చిరుతను 10 సెకెన్లలో కనిపెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..