Sound Therapy: సౌండ్ థెరపీ ప్రయోజనాల గురించి తెలుసా
ABN, Publish Date - Oct 11 , 2025 | 10:06 PM
సౌండ్ థెరపీతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని కొందరు చెబుతుంటారు. మరి ఈ అంశంపై సైన్స్ ఏం చెబుతోందో ఓసారి తెలుసుకుందాం
1/8
ట్యూనింగ్ ఫోర్క్, గాంగ్ , సింగింగ్ బౌల్ వంటి వస్తువులను మోగించినప్పుడు వెలువడే సున్నితమైన శబ్దాలు మనసుకు శరీరానికి సాంత్వన కలిగిస్తాయి.
2/8
ఇలా శబ్ద తరంగాలతో చేసే చికిత్సను సౌండ్ థెరపీ అని అంటారు.
3/8
ఈ శబ్ద తరంగాల వల్ల బ్రెయిన్ వేవ్స్ నెమ్మదించి సాంత్వన కలుగుతుంది. ధ్యానం లాగా ఇది మానసిక ప్రయోజనాలను కలిగిస్తుంది.
4/8
మనసులో గూడు కట్టుకున్న ఒత్తిడికారక భావనలు బయటకుపోయేలా చేసి కొత్త శక్తిని ఇస్తుందని కూడా కొందరు చెబుతారు.
5/8
కొన్ని రకాల ఫ్రీక్వెన్సీలు కలిగిన శబ్దాలతో ఏకాగ్రత, మెంటల్ క్లారిటీ పెరుగుతుందన్న భావన ఉంది.
6/8
సౌండ్ థెరపీతో నొప్పి, ఒత్తిడి, కండరాల్లో టెన్షన్ కూడా తొలగిపోతాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది.
7/8
సౌండ్ థెరపీతో శ్వాసపై నియంత్రణ పెరుగుతుందని, మంచి నిద్రపడుతుందని కూడా కొందరు విశ్వసిస్తారు.
8/8
అయితే, ఈ విషయాలను పూర్తిస్థాయిలో రుజువు చేసేందుకు మరింత పరిశోధన అవసరమని నిపుణులు చెబుతున్నారు.
Updated at - Oct 11 , 2025 | 10:10 PM