Statins: కొలెస్టరాల్‌ను తగ్గించే స్టాటిన్స్ గురించి ఈ విషయాలు తెలుసా
ABN, Publish Date - Nov 10 , 2025 | 11:44 PM
స్టాటిన్స్ వాడే వారు కొన్ని విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి
1/8
స్టాటిన్స్ అనే ఔషధాలు లివర్‌లోని ఓ ఎంజైమ్‌ను నిరోధించి కొలెస్టరాల్‌ను తగ్గిస్తాయి.
2/8
స్టాటిన్స్‌తో కొలెస్టరాల్ తగ్గి హృద్రోగాలు, స్ట్రోక్ ముప్పు తగ్గుతుంది.
3/8
స్టాటిన్స్‌తో ఎలాంటి ఇబ్బందులూ సాధారణంగా ఉండవు. కొందరిలో మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి
4/8
కొందరికి స్టాటిన్స్ కారణంగా ర్యాష్, తలనొప్పి, కడుపులో తిప్పడం వంటివి మొదలవుతాయి.
5/8
అత్యంత అరుదుగా కండరాలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. జ్ఞాపకశక్తిపై కూడా ప్రభావం పడుతుంది
6/8
స్టాటిన్స్‌తో మంచి ఫలితాలు రావాలంటే జీవనశైలిలో కూడా మార్పులు చేసుకోవాలి.
7/8
పోషకాహారం, క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజులు చేయడం వంటివి కొలెస్టరాల్‌ను అదుపులో ఉంచుతాయి.
8/8
మందులతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలితో కొలెస్టరాల్‌ను సులువుగా అదుపులో పెట్టొచ్చు.
Updated at - Nov 10 , 2025 | 11:48 PM