MRI: తొలిసారి ఎమ్ఆర్ఐ పరీక్షా? తప్పక తెలియాల్సిన విషయాలు ఇవీ

ABN, Publish Date - Sep 29 , 2025 | 10:32 PM

తొలిసారి ఎమ్ఆర్‌ఐ పరీక్షకు వెళ్లేవారు ముందు జాగ్రత్తగా ఈ పరీక్షపై పూర్తి అవగాహన సాధించాలి. మరి ఎమ్ఆర్ఐ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

MRI: తొలిసారి ఎమ్ఆర్ఐ పరీక్షా? తప్పక తెలియాల్సిన విషయాలు ఇవీ 1/8

శక్తిమంతమైన అయస్కాంతాలు, రేడియో తరంగా ల ద్వారా ఎమ్ఐఆర్ శరీరంలోని అవయవాల చిత్రాలను తీస్తుంది.

MRI: తొలిసారి ఎమ్ఆర్ఐ పరీక్షా? తప్పక తెలియాల్సిన విషయాలు ఇవీ 2/8

పరీక్షకు ముందు అక్కడి సిబ్బందికి మీ శరీరంలోని ఇంప్లాంట్స్ గురించి చెప్పాలి. లోహంతో చేసిన విడిభాగాలు, పేస్‌మేకర్స్, ఇతర అంతర్గత డివైజ్‌లు శరీరంలో ఉన్నట్టైతే పరీక్షకు ముందే చెప్పాలి.

MRI: తొలిసారి ఎమ్ఆర్ఐ పరీక్షా? తప్పక తెలియాల్సిన విషయాలు ఇవీ 3/8

ఆందోళన ఎక్కువతున్నట్టు అనిపిస్తే సిబ్బందికి సమాచారం ఇవ్వాలి. అప్పుడు ఓ మోస్తరు శక్తిమంమైన మత్తుమందు ఇచ్చి సిబ్బంది పరీక్షను పూర్తి చేస్తారు.

MRI: తొలిసారి ఎమ్ఆర్ఐ పరీక్షా? తప్పక తెలియాల్సిన విషయాలు ఇవీ 4/8

ఎమ్ఆర్ఐ పరీక్షలకు సాధారణంగా కడుపు ఖాళీగా ఉండాల్సిన అవసరం లేదు. అయితే, కాంట్రాస్ట్‌తో పరీక్ష చేస్తున్నట్టైతే టెస్టుకు సుమారు 4 నుంచి 6 గంటల పాటు ఏమీ తినకుండా ఉండాలి

MRI: తొలిసారి ఎమ్ఆర్ఐ పరీక్షా? తప్పక తెలియాల్సిన విషయాలు ఇవీ 5/8

పాత ఎమ్ఆర్ఐ స్కాన్స్‌ను దాచిపెట్టి వైద్యులను చూపిస్తే శరీరంలో వచ్చిన మార్పులను వైద్యులు స్పష్టంగా పసిగట్టగలుగుతారు.

MRI: తొలిసారి ఎమ్ఆర్ఐ పరీక్షా? తప్పక తెలియాల్సిన విషయాలు ఇవీ 6/8

ఎమ్ఆర్ఐ గదిలో సింపులు దుస్తులు వేసుకోవాలి. ఎలాంటి లోహాల విడిభాగాలు లేని వాటిని ధరించాలి.

MRI: తొలిసారి ఎమ్ఆర్ఐ పరీక్షా? తప్పక తెలియాల్సిన విషయాలు ఇవీ 7/8

ఎమ్ఆర్ఐ గదిలోకి వెళ్లేముందు నగలు, ఫోన్, వాచ్‌లు, చెవికి సంబంధించిన డివైజెస్‌ను గది బయటే వదిలేయాలి.

MRI: తొలిసారి ఎమ్ఆర్ఐ పరీక్షా? తప్పక తెలియాల్సిన విషయాలు ఇవీ 8/8

ఎమ్ఆర్ఐ స్కాన్ గరిష్ఠంగా 45 నిమిషాల పాటు ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మెషిన్‌ బెడ్‌పై ఉన్న రోగులు కదలకుండా ఉంటే కచ్చితమైన రిపోర్టులను పొందొచ్చు

Updated at - Sep 29 , 2025 | 10:33 PM