ఈ నగరాల్లో ప్రజలకు ఒత్తిడి ఎక్కువ
ABN, Publish Date - Oct 27 , 2025 | 10:18 PM
నగర జీవితమంటేనే ఒత్తిడి మయం. మరి ఇలాంటి ఒత్తిడి అత్యధికంగా ఉండే నగరాలు ఏంటంటే..
1/8
నిత్యం హడావుడి, ఉరుకుల పరుగుల జీవితం, ధ్వని కాలుష్యం ఉండే లాస్ వేగస్‌లో జనాలు అధిక ఒత్తిడిని ఎదుర్కొంటారు
2/8
అధిక ట్రాఫిక్, భరింపరాని జీవన వ్యయాలు, ట్రాఫిక్, కఠినంగా ఉండే జాబ్ మార్కెట్ వెరసి శాన్ ఫ్రాన్‌సిస్కో నగర వాసులు కూడా తెగ ఇబ్బంది పడుతుంటారు.
3/8
క్షణం తీరిక లేకుండా చేసే వేగవంతమైన జీవన శైలి, రద్దీ రోడ్లు, అధిక జీవన వ్యయాలు న్యూయార్క్ నగర వాసులపై తీవ్ర ఒత్తిడిని కలుగజేస్తుంటాయి
4/8
నిత్యం ఆకాశం మేఘావృతమై ఉండే లండన్ కూడా జనాలకు చుక్కలు చూపిస్తుంటుంది. దీనితోడు ప్రజారవాణా వ్యవస్థల్లో రద్దీ కూడా స్థానికులను ఇక్కట్లపాలు చేస్తుంటుంది.
5/8
ట్రాఫిక్ జామ్‌లు, ధ్వని కాలుష్యం, కార్చిచ్చులు, ఆకాశాన్నంటే ఇళ్ల అద్దెలతో లాస్ ఏంజిలిస్ జనాలు ఇబ్బంది పడుతుంటారు.
6/8
అధిక జీవన వ్యవయాలు, ప్రజారవాణా వ్యవస్థలో రద్దీ, ఉద్యోగాల్లో ఒత్తిడితో జ్యూరిచ్ నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు
7/8
శాన్ డియేగో ప్రజలను నీటి కొరత ఇబ్బంది పెడుతోంది. దీనికి అధిక జీవనవ్యయాలు, వేగవంతమైన జీవనశైలి వెరసి ఒత్తిడిని మరింత పెంచేస్తున్నాయి.
8/8
రొమాంటిక్ సిటీగా పేరు పడ్డ ప్యారిస్‌లో జనాలు.. ట్రాఫిక్ రద్దీ, ప్రజారవాణా సరిగా లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.
Updated at - Oct 27 , 2025 | 10:20 PM