Kumbh Mela Stampede: మహాకుంభమేళాలో తొక్కిసలాట దృశ్యాలు వైరల్..
ABN, Publish Date - Jan 29 , 2025 | 05:56 PM
మౌని అమావాస్య నాడు మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలు చేసేందుకు ప్రయాగ్‌రాజ్ చేరుకున్న భక్తులకు చేదు అనుభవం ఎదురైంది. పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఈ రోజు తెల్లవారుజామున తొక్కిసలాటకు దారితీసింది. ఈ విషాద ఘటనలో పదుల సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. అయితే, తొక్కిసలాట ఘటన అనంతరం ప్రయాగ్‌రాజ్‌లో కనిపించిన దృశ్యాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

మహాకుంభమేళాలో మౌని అమావాస్య నాడు గంగానది జలాలు అమృతంతో సమానమని భక్తుల విశ్వాసం. అందుకే జనవరి 29, 2025న ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న రెండో రాజస్నానానికి భక్తులు పోటెత్తారు.

త్రివేణి సంగమంలో విపరీతమైన రద్దీ కారణంగా భక్తులు గందగోళానికి గురయ్యారు. పెద్ద సంఖ్యలో ఒకేసారి ఒకరి మీద ఒకరు పడటంతో తొక్కిసలాట జరిగింది. ఘటన తర్వాత చెల్లాచెదురుగా పడి ఉన్న దుస్తులు, కుప్పలు తెప్పలుగా ఉన్న బ్యాగులు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి.

తొక్కిసలాట తర్వాత భయాందోళనకు గురై బ్యాగుల వద్ద కూర్చుని విషాదంలో మునిగిపోయిన వృద్ధుడు

తోపులాటలో గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్న భద్రతా సిబ్బంది.

పవిత్ర స్నానం కోసం సంగం తీరానికి వచ్చి దురదృష్టవశాత్తూ కుటుంబసభ్యులను కోల్పోయి రోదిస్తున్న భక్తులు

తొక్కిసలాట ఘటన తర్వాత మహాకుంభమేళా నుంచి 20 కి.మీ దూరం పరిధి వరకూ వేల సంఖ్యలో నిలిచిపోయిన వాహనాలు

తొక్కిసలాట నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన పోలీసులు సిబ్బంది. కట్టదిట్టమైన ఏర్పాట్లకు సన్నాహాలు.

ప్రయాగ్‌రాజ్‌లో ఈ రోజు వరకూ దాదాపు 4 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పరిస్థితి అదుపులోకి రావడంతో రద్దీ పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు
Updated at - Jan 29 , 2025 | 06:06 PM