Focus: ఏకాగ్రత కాపాడుకునేందుకు మెదడుకు ఇవ్వాల్సిన ట్రెయినింగ్ ఇదే
ABN, Publish Date - Oct 19 , 2025 | 10:44 PM
మనసును చెదరగొట్టే అనేక అంశాలు మన చుట్టూ ఉన్న నేటి జమానాలో ఏకాగ్రత నిలుపుకునేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి.
1/7
నేటి కాలంలో ఏకాగ్రత సాధించడం అంత సులువైన విషయం కాదు. అయితే, కొన్ని చిట్కాలు పాటిస్తే చెదరని ఏకాగ్రతను సాధించొచ్చు
2/7
గడిచిపోయిన, రాబోయే రోజుల ఆలోచనలు పక్కన పెట్టి వాస్తవంలో జీవించాలి. మెడిటేషన్ ఇందుకు ఉపకరిస్తుంది
3/7
పది పనులు ఒకేసారి చక్కపెట్టేందుకు ట్రై చేయకుండా ఒకపనిపై దృష్టి సారిస్తే ఏకాగ్రత సాధించడం సులువవుతుంది
4/7
అరగంట పని చేసి ఐదు నిమిషాలు రెస్టు తీసుకునే విధానంతో గొప్ప ఏకాగ్రత సాధించవచ్చు
5/7
మనసు ప్రశాంతంగా ఏకాగ్రత కుదిరేలా ఉండేందుకు రోజుకు 7 నుంచి 9 గంటల నిద్ర తప్పనిసరి
6/7
ఎక్సర్‌సైజులు చేస్తే కూడా మనసు, శరీరం తేలికపడి పనిపై చక్కటి ఏకాగ్రత కుదురుతుంది
7/7
చిన్న చిన్న లక్ష్యాలను ముందుగా సాధిస్తే కలిగే నమ్మకం ఏకాగ్రత పెరిగేలా చేస్తుంది.
Updated at - Oct 19 , 2025 | 10:46 PM