Nobel laureate couples: నోబెల్ బహుమతులు పొందిన జంటలు
ABN, Publish Date - Oct 12 , 2025 | 11:01 PM
భార్యాభర్తలు నోబెల్ ప్రైజ్‌లను పొందడం చాలా అరుదైన ఘటన. మరి ఇప్పటివరకూ ఎన్ని జంటలు నోబెల్ బహుమతులు పొందాయో తెలుసుకుందాం పదండి
1/9
ఇప్పటివరకూ ఆరు జంటలు నోబెల్ బహుమతులు పొందాయి. కొన్ని సందర్భాల్లో భార్యాభర్తలు కలిసి ఈ బహుమతిని సొంతం చేసుకోగా మరికొన్ని సందర్భాల్లో వేర్వేరుగా పొందారు.
2/9
నోబెల్ బహుమతి పొందిన తొలి భార్యాభర్తల జంటగా మేరీ, పియర్ క్యూరీ నిలిచారు. భౌతికశాస్త్రంలో 1903లో వారు ఈ బహుమతిని అందుకున్నారు.
3/9
1913లో మేరీ క్యూరీ రసాయనిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. రెండు వేర్వేరు శాస్త్రాల్లో ఈ బహుమతి అందుకున్న ఒకే ఒక శాస్త్రవేత్త మేరీ క్యూరీ కావడం సాటిలేని ఆమె ప్రతిభకు నిదర్శనం
4/9
మేరీ, పియర్ క్యూరీ కూతురు ఐరీన్, ఆమె భర్త ఫ్రెడ్రిక్ జూలియట్ క్యూరీ రసాయనిక శాస్త్రంలో 1935లో కలిసి నోబెల్ బహుమతికి ఎంపికయ్యారు. ఒకే కుటుంబంలోని వ్యక్తులను ఇన్ని సార్లు నోబెల్ వరించడం ఇదే తొలిసారి
5/9
గెర్టీ, కార్ల్ కోరీ దంపతులు వైద్య శాస్త్రంలో 1947లో నోబెల్ బహుమతిని అందుకున్నారు. ఒంట్లోని గ్లూకోజ్ శక్తిగా ఎలా మారుతుందో వారు గుర్తించారు.
6/9
నార్వేకు చెందిన దంపతులు, న్యూరోసైంటిస్టులు అయిన మే బ్రెట్, అడ్వార్డ్ మోసర్‌లు 2014లో వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. మెదడులోని గ్రిడ్ కణాల పనితీరును విశదీకరించినందుకు వారికి ఈ బహుమతి దక్కింది.
7/9
స్వీడెన్ శాస్త్రవేత్త గన్నర్ 1974లో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహించగా ఆయన సతీమణి అల్వాకు 1982లో నోబెల్ శాంతి బహుమతి దక్కింది
8/9
ఇప్పటివరకూ కేవలం ఆరు జంటలే నోబెల్ బహుమతిని సొంతం చేసుకున్నాయంటే ఇది ఎంతటి అరుదైన ఉదంతమో అర్థం చేసుకోవచ్చు.
9/9
ప్రకృతి రహస్యాలను ఛేదించాలన్న ఉమ్మడి లక్ష్యం, పట్టుదల, టీమ్ వర్క్‌కు ఈ జంటలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి.
Updated at - Oct 12 , 2025 | 11:07 PM