Emotional Habits: మానసిక దృఢత్వాన్ని దెబ్బతీసే అలవాట్లు

ABN, Publish Date - Oct 16 , 2025 | 10:20 PM

మానసిక దృఢత్వాన్ని దెబ్బతీసే అలవాట్లను వెంటనే వదిలించుకోవాలి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం

Emotional Habits: మానసిక దృఢత్వాన్ని దెబ్బతీసే అలవాట్లు 1/8

నిత్యం ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకుంటూ ఉంటే అసంతృప్తి, ఒత్తిడి పెరుగుతాయి. అభివృద్ధి, సంతోషాలను దూరం చేస్తాయి.

Emotional Habits: మానసిక దృఢత్వాన్ని దెబ్బతీసే అలవాట్లు 2/8

భవిష్యత్తులో రాబోయే సమస్యలను ముందుగానే ఊహించుకుని, అతిగా భయపడితే మానసిక దృఢత్వం తగ్గుతుంది. ఏకాగ్రత, సమతౌల్యత దెబ్బతింటాయి.

Emotional Habits: మానసిక దృఢత్వాన్ని దెబ్బతీసే అలవాట్లు 3/8

భావోద్వేగాలను మనసులోనే అణిచిపెట్టుకుని ఉంటే ఆందోళన పెరిగి సంతోషం, ఉత్సాహం తగ్గిపోతాయి.

Emotional Habits: మానసిక దృఢత్వాన్ని దెబ్బతీసే అలవాట్లు 4/8

గతంలో జరిగిన తప్పులు, పొరపాట్లను మనసులోనే పెట్టుకుంటే ఆలోచనల్లో క్లారిటీ లోపించి, ప్రశాంతత నశిస్తుంది.

Emotional Habits: మానసిక దృఢత్వాన్ని దెబ్బతీసే అలవాట్లు 5/8

మొహమాటం, లేదా మరొక కారణంగా ఇతరులు చెప్పిన దానికల్లా తల ఊపుతూ ఉంటే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది.

Emotional Habits: మానసిక దృఢత్వాన్ని దెబ్బతీసే అలవాట్లు 6/8

ప్రతి పని గొప్పగా చేయాలన్న ప్రయత్నంలో చాదస్తానికి పోతే పనులు ఆలస్యం అయ్యి అసలుకే ఎసరు వస్తుంది. వైఫల్యాలు ఎదురై మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది.

Emotional Habits: మానసిక దృఢత్వాన్ని దెబ్బతీసే అలవాట్లు 7/8

మన సామర్థ్యాలు, విజయాలకు ఇతరుల పోగడ్తలు, ఆమోదాన్ని కొలమానంగా మార్చుకుంటే కాన్ఫిడెన్స్ తగ్గిపోయి మానసిక దౌర్బల్యం ఆవరిస్తుంది

Emotional Habits: మానసిక దృఢత్వాన్ని దెబ్బతీసే అలవాట్లు 8/8

భావోద్వేగాలు, ఆలోచనలను సరిగ్గా నియంత్రించలేకపోతే దీర్ఘకాలంలో మానసికంగా అలసిపోయి, వివిధ రుగ్మతలు ఆవరించే ప్రమాదం ఉంది.

Updated at - Oct 16 , 2025 | 10:24 PM