Evening Habits: రాత్రిళ్లు పడుకునే ముందు ఇలా చేస్తే మరుసటి రోజు ఫుల్ ఎనర్జీ

ABN, Publish Date - Oct 14 , 2025 | 10:48 PM

రాత్రి కంటి నిండా నిద్రపట్టి మరుసటి రోజు ఫుల్ ఎనర్జీతో లేవాలనుకునే వారు కొన్ని టిప్స్ పాటించాలి. అవేంటో తెలుసుకుందాం

Evening Habits: రాత్రిళ్లు పడుకునే ముందు ఇలా చేస్తే మరుసటి రోజు ఫుల్ ఎనర్జీ 1/8

రాత్రిళ్లు పడక గదిలో లావెండర్, చందనం సువాసనలు వెదజల్లే అగరత్తులను ఏర్పాటు చేసుకుంటే మెదడు రిలాక్స్ అయ్యి గాఢ నిద్ర పడుతుంది.

Evening Habits: రాత్రిళ్లు పడుకునే ముందు ఇలా చేస్తే మరుసటి రోజు ఫుల్ ఎనర్జీ 2/8

రాత్రి పడుకునే మందు మనసుకు సాంత్వన ఇచ్చే సంగీతం వింటే ఒత్తిడి తగ్గుతుంది. మంచి నిద్రపట్టి మరుసటి రోజు పూర్తి ఉత్సాహంతో నిద్రలేస్తారు

Evening Habits: రాత్రిళ్లు పడుకునే ముందు ఇలా చేస్తే మరుసటి రోజు ఫుల్ ఎనర్జీ 3/8

పడుకునే ముందు 5 నుంచి 10 నిమిషాల పాటు పలుమార్లు సుదీర్ఘ శ్వాస తీసుకుని వదిలితే రాత్రి మంచి నిద్రపట్టి మరుసటి రోజు ఉదయం హ్యాపీగా నిద్ర లేస్తారు.

Evening Habits: రాత్రిళ్లు పడుకునే ముందు ఇలా చేస్తే మరుసటి రోజు ఫుల్ ఎనర్జీ 4/8

పడక గదిలో రాత్రిళ్లు తక్కువ స్థాయి వెలుతురు ఉండేలా చూసుకుంటే శరీరంలో మెలటోనిన్ విడుదలై మంచి నిద్రపడుతుంది. మరుసటి రోజుకు అలసట అంతా వదిలిపోయి ఫుల్ ఎనర్జీతో నిద్ర లేవగలుగుతారు.

Evening Habits: రాత్రిళ్లు పడుకునే ముందు ఇలా చేస్తే మరుసటి రోజు ఫుల్ ఎనర్జీ 5/8

పుదీనా, నిమ్మ టీ వంటివి తాగితే నాడీ వ్యవస్థ రిలాక్స్ అవుతుంది. గాఢ నిద్ర పట్టి శరీరం పూర్తిస్థాయిలో కోలుకుంటుంది.

Evening Habits: రాత్రిళ్లు పడుకునే ముందు ఇలా చేస్తే మరుసటి రోజు ఫుల్ ఎనర్జీ 6/8

నిద్రకు ఉపక్రమించే ముందు ఒంటిని బాగా స్ట్రెచ్ చేస్తే పట్టేసినట్టు ఉన్న కండరాలు రిలాక్స్ అవుతాయి. దీంతో మంచి నిద్రపట్టి అలసట మొత్తం వదిలిపోతుంది.

Evening Habits: రాత్రిళ్లు పడుకునే ముందు ఇలా చేస్తే మరుసటి రోజు ఫుల్ ఎనర్జీ 7/8

మరుసటి రోజు ఏం చేయాలనే అంశాలను ఓ లిస్టు చేసుకుని ఆ ప్రకారం పూర్తి చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటే మనసుపై ఒత్తిడి తగ్గి మంచి నిద్రపడుతుంది.

Evening Habits: రాత్రిళ్లు పడుకునే ముందు ఇలా చేస్తే మరుసటి రోజు ఫుల్ ఎనర్జీ 8/8

గోరు వెచ్చటి నీటితో స్నానం కూడా మనసును, శరీరాన్ని రిలాక్స్ అయ్యేలా చేసి గాఢ నిద్రపట్టేలా చేస్తుంది.

Updated at - Oct 14 , 2025 | 10:52 PM