Data Security: పాత ఫోన్ అమ్మేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ABN, Publish Date - Oct 17 , 2025 | 10:31 PM
పాత ఫోన్ విక్రయించే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.
1/8
ఫోన్ డేటా మొత్తం తొలగించాకే ఫోన్‌ను విక్రయించాలి. అయితే, కేవలం పాత ఫైల్స్ డిలీట్ చేసినంత మాత్రాన ఫైల్స్ తొలగిపోతాయని భావించొద్దు. ప్రత్యేక రికవరీ టూల్స్‌తో డేటాను మళ్లీ పొందే ఛాన్సుంది.
2/8
ఫోన్‌లో డేటా మొత్తాన్ని వైప్ చేసే ముందు ఫొటోలు, డాక్యుమెంట్సు, మెసేజీలు వంటివన్నీ పక్కాగా బ్యాకప్ చేసుకోవడం బెటర్
3/8
డేటాను వైప్ చేసే ముందు అన్ని అకౌంట్స్ నుంచి లాగ్ అవుట్ అయిపోవాలి. దీంతో, మీ ఐడెంటిటీ ఇతరుల చేతుల్లోకి వెళ్లదు.
4/8
ఫైండ్ మై ఐఫోన్, ఫ్యాక్టరీ రీసెట్ ప్రొటెక్షన్, యాక్టివేషన్ లాక్, ఇతర డివైజ్ లాకింగ్ అకౌంట్స్ అన్నింటినీ టర్న్ ఆఫ్ చేయాలి.
5/8
డాటాను పూర్తిగా వైప్ చేశాక. స్టోరేజీని మూవీలు, ఇతర డమ్మీ డాటాతో నింపితే మునుపటి వ్యక్తిగత వివరాలను వెలికి తీయడం మరింత కష్టంగా మారుతుంది.
6/8
పైపనులన్నీ పూర్తి చేశాక మాత్రమే ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి.
7/8
రీసెట్ తరువాత ఈ డివైజ్‌ను గూగుల్, లేదా యాపిల్ డివైజ్ లిస్టుల నుంచి కూడా తొలగించాలి.
8/8
ఫోన్‌లో మరీ సున్నితమైన డేటా దాచిపెట్టిన సందర్భాల్లో ఎన్ఐఎస్‌టీ800-8 లాంటి సాఫ్ట్‌వేర్‌లతో వైప్ చేయడం లేదా ఫోన్‌ను ధ్వంసం చేయడం వంటివి చేయాలి.
Updated at - Oct 17 , 2025 | 10:33 PM