PF Account Transfer: నెలల నిరీక్షణకు చెక్.. ఈజీగా అకౌంట్ ట్రాన్స్‌ఫర్..
ABN, Publish Date - Oct 14 , 2025 | 05:57 PM
ఎంప్లయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తమ ఖాతాదారుల కోసం కొత్త కొత్త ఫీచర్స్ అందుబాటులోకి తెస్తోంది. ఒకప్పుడు రోజులు, నెలలు, సంవత్సరాలు పట్టే పనిని కూడా ఈజీ చేసేసింది.
1/6
ఎంప్లయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తమ ఖాతాదారుల కోసం కొత్త కొత్త ఫీచర్స్ అందుబాటులోకి తెస్తోంది. ఒకప్పుడు రోజులు, నెలలు, సంవత్సరాలు పట్టే పనిని కూడా ఈజీ చేసేసింది.
2/6
తరచుగా కంపెనీలు మారే వారికి పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ విషయంలో గతంలో చాలా సమస్య ఉండేది. కొత్త కంపెనీలో చేరినపుడు పాత కంపెనీ నుంచి అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలంటే నెలల సమయం పట్టేది.
3/6
పాత కంపెనీ నుంచి అనుమతి తీసుకోవాల్సి వచ్చేది. అయితే, ‘వన్ మెంబర్ .. వన్ ఈపీఎఫ్ అకౌంట్’తో ఈ సమస్యకు చెక్ పడింది. పాత కంపెనీ అనుమతి లేకుండానే మీరు మీ అకౌంట్‌ను ఓ కంపెనీ నుంచి మరో కంపెనీకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.
4/6
ఆధార్ కార్డు, యాక్టీవ్‌లో ఉన్న యూఏఎన్ ఉంటే సరిపోతుంది. అకౌంట్ ట్రాన్స్‌ఫర్ కోసం మీరు ఏం చేయాలంటే.. ఈ సేవా పోర్టల్‌లోకి వెళ్లి లాగిన్ అవ్వాలి. ఆన్‌లైన్ సర్వీసుల్లోకి వెళ్లి ‘వన్ మెంబర్ .. వన్ ఈపీఎఫ్ అకౌంట్’ క్లిక్ చేయాలి.
5/6
అక్కడ మీ పాత కంపెనీపై క్లిక్ చేయాలి. అక్కడ కరెంట్ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలి. ఆధార్ ఓటీపీతో వెరిఫికేషన్ చేసుకోవాలి. తర్వాత మీ సబ్‌మిట్ కొట్టాలి.
6/6
ఇది డైరెక్ట్‌గా ఈపీఎఫ్ఓ ప్రాసెసింగ్‌లోకి వెళ్లిపోతుంది. మీ నుంచి ఎలాంటి సమస్య లేకుంటే కొన్ని రోజుల్లోనే మీ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది.
Updated at - Oct 14 , 2025 | 05:59 PM