ప్రశాంతంగా ప్రారంభమైన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

ABN, Publish Date - Dec 11 , 2025 | 09:39 AM

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తొలి విడత పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. ఒంటి గంట తర్వాతి నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. సాయంత్రానికి ఫలితాలు వస్తాయి.

ప్రశాంతంగా ప్రారంభమైన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ 1/10

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తొలి విడత పోలింగ్ మొదలైంది.

ప్రశాంతంగా ప్రారంభమైన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ 2/10

ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఉంది.

ప్రశాంతంగా ప్రారంభమైన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ 3/10

ఒంటి గంట తర్వాతి నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. సాయంత్రానికి ఫలితాలు వస్తాయి.

ప్రశాంతంగా ప్రారంభమైన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ 4/10

తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొత్తం 189 మండలాల్లోని 3,834 సర్పంచ్, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది.

ప్రశాంతంగా ప్రారంభమైన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ 5/10

షెడ్యూల్‌ ప్రకారం తొలి విడతలో 189 మండలాల పరిధిలో 4,236 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, అందులో 395 పంచాయతీల్లో సర్పంచ్‌ పదవులు ఏకగ్రీవం అయ్యాయి.

ప్రశాంతంగా ప్రారంభమైన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ 6/10

3,834 గ్రామ పంచాయతీలకు గురువారం ఉదయం పోలింగ్‌ ప్రారంభమైంది.

ప్రశాంతంగా ప్రారంభమైన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ 7/10

మిగిలిన 5 గ్రామాల్లో ఒక్క నామినేషన్‌ దాఖలు కాకపోవటంతో పోలింగ్‌ జరగటం లేదు.

ప్రశాంతంగా ప్రారంభమైన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ 8/10

ఈ ఎన్నికల కోసం మొత్తం 37,562 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా, సుమారు 93,905 మంది పోలింగ్‌ సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు.

ప్రశాంతంగా ప్రారంభమైన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ 9/10

తొలి విడతలో 3,834 సర్పంచ్‌ స్థానాల్లో 12,960 మంది, 27,628 వార్డు స్థానాల్లో 65,455 మంది పోటీపడుతున్నారు.

ప్రశాంతంగా ప్రారంభమైన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ 10/10

తొలి విడత పోలింగ్ నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది బుధవారమే మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి పోలింగ్ సామగ్రి తీసుకుని తమకు కేటాయించిన గ్రామాలకు చేరుకున్నారు.

Updated at - Dec 11 , 2025 | 09:39 AM