చార్మినార్ వద్ద ప్రపంచ అందాల భామల హెరిటేజ్ వాక్..

ABN, Publish Date - May 13 , 2025 | 08:07 PM

చార్మినార్‌ సందర్శించిన 109 దేశాల మిస్ వరల్డ్ పోటీదారులు అక్కడ హెరిటేజ్‌ వాక్‌ చేశారు.

చార్మినార్ వద్ద ప్రపంచ అందాల భామల హెరిటేజ్ వాక్.. 1/10

మిస్‌ వరల్డ్‌-2025 పోటీదారులు మంగళవారం హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాలను సందర్శించారు.

చార్మినార్ వద్ద ప్రపంచ అందాల భామల హెరిటేజ్ వాక్.. 2/10

తెలంగాణ పర్యాటక శాఖ బస్సుల్లో వచ్చిన ప్రపంచ సుందరీమణులు హైదరాబాద్ పాత బస్తీలోనూ సందడి చేశారు.

చార్మినార్ వద్ద ప్రపంచ అందాల భామల హెరిటేజ్ వాక్.. 3/10

చార్మినార్‌ సందర్శించిన 109 దేశాల మిస్ వరల్డ్ పోటీదారులు అక్కడ హెరిటేజ్‌ వాక్‌ చేశారు.

చార్మినార్ వద్ద ప్రపంచ అందాల భామల హెరిటేజ్ వాక్.. 4/10

హెరిటేజ్ వాక్ అనంతరం అందాలభామలు లాడ్‌ బజార్‌లో కలియతిరిగి షాపింగ్‌ చేశారు.

చార్మినార్ వద్ద ప్రపంచ అందాల భామల హెరిటేజ్ వాక్.. 5/10

ఈ మేరకు అధికారులు చార్మినార్ పరిసర ప్రాంతాలను సర్వాంగసుందరంగా అలంకరించారు.

చార్మినార్ వద్ద ప్రపంచ అందాల భామల హెరిటేజ్ వాక్.. 6/10

తెలంగాణ వారసత్వాన్ని, సాంస్కృతిక సంపదను ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో తెలంగాణ సర్కార్ మిస్ వరల్డ్ హెరిటేజ్ వాక్ చేపట్టింది.

చార్మినార్ వద్ద ప్రపంచ అందాల భామల హెరిటేజ్ వాక్.. 7/10

ఈ సందర్భంగా మార్ఫా వాయిద్యాలతో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్‌కు స్థానికులు ఘనస్వాగతం పలికారు.

చార్మినార్ వద్ద ప్రపంచ అందాల భామల హెరిటేజ్ వాక్.. 8/10

చార్మినార్ చుట్టూ తిరిగి సుందరీమణులు అక్కడి ప్రదేశాలను తమ సెల్ ఫోన్లలో బంధించారు.

చార్మినార్ వద్ద ప్రపంచ అందాల భామల హెరిటేజ్ వాక్.. 9/10

చార్మినార్ చుడీ బజార్‌లో ఎంపిక చేసిన తొమ్మిది దుకాణాల్లో వివిధ రకాల గాజులు, ముత్యాలహారాలు అలంకరణ వస్తువులను కొనుగోలు చేశారు.

చార్మినార్ వద్ద ప్రపంచ అందాల భామల హెరిటేజ్ వాక్.. 10/10

మరోవైపు మిస్‌ వరల్డ్‌ పోటీదారులు బుధవారం ఓరుగల్లు పర్యటనకు రానున్నారు. ఇందుకోసం పర్యాటక శాఖ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది.

Updated at - May 13 , 2025 | 08:07 PM