భారీగా ఇండిగో ఫ్లైట్ సర్వీసుల రద్దు.. ఆకాశాన్ని అంటిన టికెట్ ధరలు..

ABN, Publish Date - Dec 05 , 2025 | 05:12 PM

ఇండిగో సంస్థ పైలట్ల కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గురువారం ఒక్క రోజే దేశంలోని వివిధ ఎయిర్‌పోర్టుల్లో 500 పైచిలుకు ఫ్లైట్‌లు రద్దయ్యాయి. శుక్రవారం కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫ్లైట్ టికెట్ రేట్లు కూడా భారీగా పెరిగిపోయాయి.

భారీగా ఇండిగో ఫ్లైట్ సర్వీసుల రద్దు.. ఆకాశాన్ని అంటిన టికెట్ ధరలు.. 1/8

ఇండిగో సంస్థ పైలట్ల కొరత కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. గురువారం ఒక్క రోజే దేశంలోని వివిధ ఎయిర్‌పోర్టుల్లో 500 పైచిలుకు ఫ్లైట్‌లు రద్దయ్యాయి.

భారీగా ఇండిగో ఫ్లైట్ సర్వీసుల రద్దు.. ఆకాశాన్ని అంటిన టికెట్ ధరలు.. 2/8

శుక్రవారం కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫ్లైట్ టికెట్ రేట్లు కూడా భారీగా పెరిగిపోయాయి.

భారీగా ఇండిగో ఫ్లైట్ సర్వీసుల రద్దు.. ఆకాశాన్ని అంటిన టికెట్ ధరలు.. 3/8

కేవలం ఇండిగో సంస్థ మాత్రమే కాకుండా సందట్లో సడేమియా అన్నట్లు మిగిలిన సంస్థలు కూడా టికెట్ రేట్లను భారీగా పెంచేశాయి.

భారీగా ఇండిగో ఫ్లైట్ సర్వీసుల రద్దు.. ఆకాశాన్ని అంటిన టికెట్ ధరలు.. 4/8

ముంబై నుంచి గువహటి వెళ్లే ఎకానమీ టికెట్ రేట్లు ఇలా ఉన్నాయి. ఇండిగో నాన్ స్టాప్ 25 వేల రూపాయలు, ఆకాశ ఎయిర్ 31 వేల రూపాయలు.

భారీగా ఇండిగో ఫ్లైట్ సర్వీసుల రద్దు.. ఆకాశాన్ని అంటిన టికెట్ ధరలు.. 5/8

ఢిల్లీ నుంచి కొచ్చి వెళ్లే వన్ స్టాప్ సర్వీస్ టికెట్ రేట్లు ఇలా ఉన్నాయి. ఇండిగో 40 వేల రూపాయలు, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 41 వేల రూపాయలు, ఎయిర్ ఇండియా 42 వేల రూపాయలు.

భారీగా ఇండిగో ఫ్లైట్ సర్వీసుల రద్దు.. ఆకాశాన్ని అంటిన టికెట్ ధరలు.. 6/8

ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే డొమస్టిక్ సర్వీసుల కంటే ఇంటర్‌నేషనల్ ట్రావెల్ టికెట్ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి.

భారీగా ఇండిగో ఫ్లైట్ సర్వీసుల రద్దు.. ఆకాశాన్ని అంటిన టికెట్ ధరలు.. 7/8

ఢిల్లీ నుంచి లండన్ వెళ్లే విమానాల టికెట్ రేట్లు ఇలా ఉన్నాయి. ఎయిర్ ఇండియా 25 వేల రూపాయలు, వర్జిన్ అట్లాంటిక్ 27 వేల రూపాయలు.

భారీగా ఇండిగో ఫ్లైట్ సర్వీసుల రద్దు.. ఆకాశాన్ని అంటిన టికెట్ ధరలు.. 8/8

ముంబై నుంచి దుబాయ్ వెళ్లే విమానాల టికెట్ రేట్లు ఇలా ఉన్నాయి. స్పైస్ జెట్ నాన్ స్టాప్ 15 వేల రూపాయలు, ఇండిగో నాన్ స్టాప్ 16 వేల రూపాయలు.

Updated at - Dec 05 , 2025 | 05:12 PM