Bharatiya Kala Mahotsav: రాష్ట్రపతి నిలయంలో సాంస్కృతిక ప్రదర్శనలు

ABN, Publish Date - Nov 23 , 2025 | 07:54 AM

భారతీయ కళా మహోత్సవాన్ని పురస్కరించుకొని బొల్లారం రాష్ట్రపతి నిలయంలో పలు సాంస్కృతిక ప్రదర్శనలు జరిగాయి. రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ సహా పలు రాష్ట్రాలకు చెందిన కళాకారులు ఆకట్టుకునే ప్రదర్శనలను ఇచ్చారు.

Bharatiya Kala Mahotsav: రాష్ట్రపతి నిలయంలో సాంస్కృతిక ప్రదర్శనలు 1/10

బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవాన్ని పురస్కరించుకుని పలు రాష్ట్రాలకు చెందిన వారు కళా ప్రదర్శనలను ఇచ్చారు.

Bharatiya Kala Mahotsav: రాష్ట్రపతి నిలయంలో సాంస్కృతిక ప్రదర్శనలు 2/10

రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ సహా వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు ఈ ప్రదర్శనలను ఇచ్చారు.

Bharatiya Kala Mahotsav: రాష్ట్రపతి నిలయంలో సాంస్కృతిక ప్రదర్శనలు 3/10

మొత్తం 250 మంది కళాకారులు ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారు. వీరిలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు.

Bharatiya Kala Mahotsav: రాష్ట్రపతి నిలయంలో సాంస్కృతిక ప్రదర్శనలు 4/10

సంప్రదాయ నృత్యరీతులతో పాటు ఢోల్ టాషా, లెజిమ్, కల్బేలియా, వంటి జానపద నాట్య రీతుల ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి

Bharatiya Kala Mahotsav: రాష్ట్రపతి నిలయంలో సాంస్కృతిక ప్రదర్శనలు 5/10

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ్‌ 2వ ఎడిషన్‌ను ప్రారంభించారు.

Bharatiya Kala Mahotsav: రాష్ట్రపతి నిలయంలో సాంస్కృతిక ప్రదర్శనలు 6/10

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, టెక్స్‌టైల్స్ శాఖల ఆధ్వర్యంలో రాష్ట్రపతి నిలయంలో తొమ్మిది రోజుల పాటు ఈ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.

Bharatiya Kala Mahotsav: రాష్ట్రపతి నిలయంలో సాంస్కృతిక ప్రదర్శనలు 7/10

ఈ మహోత్సవం ఈశాన్య రాష్ట్రాల కళావైభవానికి అద్దం పడుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పశ్చిమ రాష్ట్రాల కళాప్రదర్శనలు ఈసారి హైలైట్‌గా నిలిచాయని అన్నారు.

Bharatiya Kala Mahotsav: రాష్ట్రపతి నిలయంలో సాంస్కృతిక ప్రదర్శనలు 8/10

తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయం, కళానైపుణ్యాల గొప్పదనాన్ని ఈ మహోత్సవం చాటిచెప్పిందని రాష్ట్రపతి అన్నారు.

Bharatiya Kala Mahotsav: రాష్ట్రపతి నిలయంలో సాంస్కృతిక ప్రదర్శనలు 9/10

భారత సాంస్కృతిక వైభవాన్ని, వైవిధ్యాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం ఈ ఈవెంట్ కల్పించిందని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు.

Bharatiya Kala Mahotsav: రాష్ట్రపతి నిలయంలో సాంస్కృతిక ప్రదర్శనలు 10/10

ఈ ఈవెంట్ ద్వారా భారత దేశ సంస్కృతిపై యువతకు అవగాహన పెంచుకునే అవకాశం దక్కిందని కూడా రాష్ట్రపతి ముర్ము అన్నారు.

Updated at - Nov 23 , 2025 | 08:00 AM