AI Bubble: ఏఐ బుడగ.. ఇది బద్దలైతే.. నిపుణుల హెచ్చరిక
ABN, Publish Date - Oct 07 , 2025 | 03:45 PM
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై (ఏఐ) చర్చే. భవిష్యత్తు ఏఐదే అని జనాలు అనుకుంటున్నారు. అయితే, ఇదంతా హైప్ అనే వారూ లేకపోలేదు. ఈ బుడగ బద్దలైతే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు.
1/8
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతపై మితిమీరిన అంచనాలు బుడగ వలె పేలి ఆర్థిక సమస్యగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
2/8
ఒకప్పటి డాట్ కామ్ బబుల్ కంటే 17 రేట్లు, 2008 నాటి సబ్‌ప్రైమ్ సంక్షోభం కంటే 4 రెట్లు పెద్దదిగా ఏఐ బబుల్ మారిందని ఓ స్వతంత్ర రీసెర్చ్ సంస్థ తాజాగా హెచ్చరించింది.
3/8
దీర్ఘకాలిక, సుస్థిర రాబడులపై ఎలాంటి గ్యారెంటీ లేకున్నా కూడా ఏఐ ప్రాజెక్టుల్లోకి భారీ స్థాయిలో పెట్టుబడులు మళ్లాయని సంస్థ హెచ్చరించింది.
4/8
కొన్ని కొలమానాల ప్రకారం విశ్లేషిస్తే.. పలు భారీ సంస్థలు ఇప్పటికే లార్జ్ లాంగ్వె్జ్ మోడల్స్ వినియోగంపై బ్రేకులు వేశాయి.
5/8
కొత్త చాట్‌జీపీటీ వర్షెన్స్ అభివృద్ధి, వినియోగానికి కర్చు పెరిగినా, వాటి సామర్థ్యంలో పెరుగుదల మాత్రం అంతంతమాత్రమే అని ఆ నివేదిక హెచ్చరించింది.
6/8
ఏఐపై భారీగా పెట్టుబడులు పెట్టిన కొన్ని టెక్ సంస్థలు ఇప్పటికే అప్పుల భారంతో ఒత్తిడి ఎదుర్కొంటున్న వైనం ఓ హెచ్చరిక అని సంస్థ పేర్కొంది.
7/8
ఇక మరో ఏడాది రెండేళ్లల్లో ఏఐ విషయంలో మార్కెట్‌లు ప్రతికూలంగా స్పందించే అవకాశం ఉందని గోల్డ్‌మన్ శాక్స్‌కు చెందిన డేవిడ్ సొమన్ లాంటి ఆర్థికవేత్తలు ఇప్పటికే హెచ్చరించారు.
8/8
ఏఐ బబుల్ ఉండే అవకాశం ఉన్నా భవిష్యత్తుపై మాత్రం ఆశ ఉందని జెఫ్ బెజోస్ అన్నారు. ఈ హడావుడి సర్దుమణిగాకా అసలు విజేతలు ఎవరో తేలుతుందని, సమాజానికీ ఏఐ ఫలాలు అందుతాయని కామెంట్ చేశారు.
Updated at - Oct 07 , 2025 | 03:49 PM