Srikakulam Arasavilli : అరసవెల్లిలో ఘనంగా రథసప్తమి వేడుకలు.. 5 వేల మందితో సూర్యనమస్కారం..
ABN, Publish Date - Feb 03 , 2025 | 05:24 PM
శ్రీకాకుళంలోని అరసవెల్లిలో ఈ రోజు రథసప్తమి వేడుకల ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా 80 అడుగుల రోడ్డులో 5 వేల మందితో నిర్వహించిన సూర్యనమస్కార కార్యక్రమం హైలెట్‌గా నిలిచింది.

శ్రీకాకుళంలోని అరసవెల్లిలో ఈ రోజు రథసప్తమి వేడుకల ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా 80 అడుగుల రోడ్డులో 5 వేల మందితో నిర్వహించిన సూర్యనమస్కార కార్యక్రమం హైలెట్‌గా నిలిచింది.

యోగా గురువు రామారావు అధ్యక్షతన జరిగిన యోగా కార్యక్రమంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అందరితో కలిసి ఆసనాలు వేశారు.

వేకువ జామునే సూర్యనమస్కారాలు, యోగాసనాలు చేసేందుకు పిల్లలు, పెద్దలు పెద్ద ఎత్తున అరసవెల్లికి తరలివచ్చారు.

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు యోగాసనాలు వేసి అందరిలో ఉత్సాహం నింపారు.

యోగా కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.

కేంద్రమంత్రితో కలిసి ఫోటో దిగేందుకు ఉత్సాహం చూపిస్తున్న ప్రజలు
Updated at - Feb 03 , 2025 | 05:24 PM