Rathasaptami Celebrations: అరసవెల్లిలో ఘనంగా రథసప్తమి వేడుకలు..
ABN, Publish Date - Feb 04 , 2025 | 07:50 PM
శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లిలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సూర్య నారాయణుడిని పూజించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ నేపధ్యంలో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేశారు.

మాఘ మాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథి ‘రథ సప్తమి’.

హిందూ పురాణాల ప్రకారం.. కశ్యప మహర్షి, అధితి దేవి దంపతులకు జన్మించిన సూర్యభగవానుడు. ఆయన పుట్టినరోజు సందర్భంగానే రథ సప్తమి.

ఈ పవిత్రమైన రోజున సూర్య నారాయణుడిని పూజిస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.

అరసవెల్లిలోని సూర్యనారాయణ స్వామిని పెద్ద ఎత్తున్న దర్శించుకున్న ప్రజలు.

రథసప్తమి వేడుకల నేపథ్యంలో పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేసిన అధికారులు.
Updated at - Feb 04 , 2025 | 07:53 PM