Tirumala Brahmotsavam 2025: అత్యంత ఘనంగా బంగారు గొడుగు ఉత్సవం

ABN, Publish Date - Sep 30 , 2025 | 09:39 PM

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆనవాయితీగా నిర్వహించే బంగారు గొడుగు ఉత్సవం మంగ‌ళ‌వారం సాయంత్రం అత్యంత ఘనంగా జరిగింది.

Tirumala Brahmotsavam 2025: అత్యంత ఘనంగా బంగారు గొడుగు ఉత్సవం 1/5

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆనవాయితీగా నిర్వహించే బంగారు గొడుగు ఉత్సవం మంగ‌ళ‌వారం సాయంత్రం అత్యంత ఘనంగా జరిగింది.

Tirumala Brahmotsavam 2025: అత్యంత ఘనంగా బంగారు గొడుగు ఉత్సవం 2/5

శ్రీవారి రథోత్సవాన్ని పురస్కరించుకొని అనాదిగా వస్తున్న ఆచార సంప్రదాయం మేరకు ముందురోజు సాయంత్రం శ్రీవారి కల్యాణకట్ట సిబ్బంది ఆధ్వర్యంలో నూతన ఛత్రస్థాపనాన్ని చేస్తారు.

Tirumala Brahmotsavam 2025: అత్యంత ఘనంగా బంగారు గొడుగు ఉత్సవం 3/5

చంద్రగిరిరాజు శ్రీనివాస మహదేవ రాయలు చేసిన ధర్మ శాసనం ప్రకారం పంతులుగారి వంశస్తులు ఈ హక్కును కొన్ని శతాబ్దాలుగా అనుసరిస్తూ వస్తున్నారు.

Tirumala Brahmotsavam 2025: అత్యంత ఘనంగా బంగారు గొడుగు ఉత్సవం 4/5

తొలి రోజుల్లో కొయ్య గొడుగుతో ప్రారంభమై, అటు తరువాత 1952 నుండి రథానికి బంగారు గొడుగు సమర్పించడం జరుగుతున్నది.

Tirumala Brahmotsavam 2025: అత్యంత ఘనంగా బంగారు గొడుగు ఉత్సవం 5/5

ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతా రామ్, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, కల్యాణకట్ట డిప్యూటీ ఈవో పీ వెంకటయ్య, ఏఈవో సీఏ అమరనాధ్, సూపరింటెండెంట్ జీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

Updated at - Sep 30 , 2025 | 09:44 PM