Share News

Telangana Evacuation: గల్ఫ్‌లో ఉద్రిక్తతలు.. సురక్షితంగా భారత్‌కు చేరుకున్న 25 మంది తెలంగాణ వాసులు

ABN , Publish Date - Jun 26 , 2025 | 08:11 AM

గల్ఫ్‌‌లో ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో అక్కడున్న మరో 25 మంది తెలంగాణ వాసులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. వారి ప్రయాణానికి ఎలాంటి అవాంతరాలు లేకుండా తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

Telangana Evacuation: గల్ఫ్‌లో ఉద్రిక్తతలు.. సురక్షితంగా భారత్‌కు చేరుకున్న 25 మంది తెలంగాణ వాసులు
Middle East conflict returnees

గల్ఫ్‌లో ఉద్రిక్తతల కారణంగా అక్కడ చిక్కుకుపోయిన తెలంగాణ వాసులను స్వదేశానికి తరలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా మరో 25 మంది తెలంగాణ వాసులు సురక్షితంగా భారత్‌కు చేరుకున్నారు. ఇరాన్ నుంచి ఏడుగురు, ఇజ్రాయెల్ నుంచి 18 మంది న్యూఢిల్లీలో దిగారు. దీంతో, స్వదేశానికి తిరిగొచ్చిన వారి సంఖ్య 48కి చేరుకుంది. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లోని రాష్ట్ర బృందం.. గల్ఫ్ నుంచి తిరిగొచ్చిన వారి సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసింది. తదుపరి జర్నీకి అవసరమైన సాయం అందించింది. వీరిలో అధికశాతం మంది హైదరాబాద్‌కు విమాన టిక్కెట్లు ఏర్పాటు చేసుకున్నారు.

1.jpg


ఈ ప్రయాణానికి అడ్డంకులు లేకుండా రాష్ట్ర అధికారుల బృందం చర్యలు తీసుకుంది. కాల్పుల విరమణ ప్రకటన తరువాత భారతీయుల తరలింపు మరింత వేగవంతమైంది. తెలంగాణ వాసులను సురక్షితంగా తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక హెల్ప్‌లైన్ అందుబాటులోనే ఉంటుందని, ప్రయాణంలో ఉన్న వారు, గల్ఫ్ దేశాల్లో ఉన్న వారు హెల్ప్‌లైన్‌‌ను సంప్రదించి కావాల్సిన సమాచారం పొందొచ్చని వెల్లడించింది.


సహాయం కోసం ప్రజలు కింది నెంబర్లను సంప్రదించవచ్చు:

వందన.పి.ఎస్, రెసిడెంట్ కమిషనర్ – +91 9871999044

జి. రక్షిత్ నాయక్, లైజన్ ఆఫీసర్ – +91 9643723157

జావేద్ హుస్సేన్, లైజన్ ఆఫీసర్ – +91 9910014749

సిహెచ్. చక్రవర్తి, పౌర సంబంధాల అధికారి – +91 9949351270

ఇవీ చదవండి:

సౌదీలో ఇబ్బందులు ఎదుర్కొన్న ఏలూరు యువకుడికి ఊరట..

అట్లాంటాలో ఫోర్సిత్‌ కౌంటీ షెరీఫ్‌ సిబ్బందికి తానా నాయకుల సత్కారం

Read Latest and NRI News

Updated Date - Jun 26 , 2025 | 11:45 AM