Share News

TANA Badminton Tournament: తానా బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ విజయవంతం

ABN , Publish Date - May 23 , 2025 | 07:50 PM

తానా ఆధ్వర్యంలో ఫోర్టియస్‌ స్పోర్ట్స్‌ అకాడమీలో బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ విజయవంతంగా నిర్వహించింది. స్థానిక తెలుగు వారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

TANA Badminton Tournament: తానా బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ విజయవంతం
TANA badminton tournament

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) క్రీడాకారుల కోసం వివిధ రకాల ఆటల పోటీలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మే 17వ తేదీన తానా బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ను నిర్వహించింది. ఫోర్టియస్‌ స్పోర్ట్స్‌ అకాడమీలో జరిగిన ఈ టోర్నమెంట్‌లో వివిధ టీమ్‌లు పాల్గొన్నాయి. వివిధ వయస్సుల తెలుగు క్రీడా భిమానులు ఇందులో పాల్గొన్నారు. సౌత్‌ ఈస్ట్‌ రీజినల్‌ కోఆర్డినేటర్‌ మధుకర్‌ ఈ పోటీలను తానా స్పోర్ట్స్‌ కోఆర్డినేటర్‌ నాగ పంచుమర్తి సహకారంతో ఘనంగా నిర్వహించారు. ఫోర్టియస్‌ స్పోర్ట్స్‌ అకాడమీకి చెందిన ఉదయ్‌, ఎజె అద్భుతమైన క్రీడా వేదికలు, నిర్వహణకు సహకరించారు. చందు టోర్నమెంట్‌ ప్లానింగ్‌, లక్ష్మీ ఈవెంట్‌ ప్రమోషన్‌, శశి తదితరుల సహకారంతో ఈ టోర్నమెంట్‌ విజయవంతమైంది.

2.jpg


తానా నాయకులు అంజయ్య చౌదరి లావు, శ్రీనివాస్‌ లావు భరత్‌ మద్దినేని, వినయ్‌ మద్దినేని, కిరణ్‌ గోగినేని, సోహిని ఐనాల, శ్రీనివాస్ ఉప్పు, విజయ్ కొత్త, ఫోర్టియస్‌ స్పోర్ట్స్‌ అకాడమీ నుండి సతీష్‌ పునాటి, శ్యామ్‌ మల్లవరపు, విజయ్‌ కొట్ట, విష్ణు వైదన, తామా నుంచి రాఘవ తడవర్తి, సురేష్‌ బండారు, సాయి రామ్‌ కారుమంచి, సునీల్‌ దేవరపల్లి, శ్రీనివాసులు రామిశెట్టి తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు తానా అభిమానులు మురళి బొద్దు, సుధాకర్‌ బొద్దు, భాను గుల్లపల్లి, అనిల్‌ చిమిలి తదితరులు హాజరుకావడం ఈ కార్యక్రమానికి మరింత జోష్‌ తీసుకువచ్చింది. ఈ పోటీల్లో విజేతలకు ట్రోఫీలను, బహుమతులను అందించారు.

3.jpg4.jpg


ఇవి కూడా చదవండి:

BATA, TANA ఆధ్వర్యంలో ఘనంగా ‘పాఠశాల’ 12వ వార్షికోత్సవం

అమెరికా కీలక నిర్ణయం.. నిబంధనలు ఉల్లంఘించిన భారతీయ ట్రావెల్ ఏజెంట్లపై ఆంక్షలు

హెచ్-1బీ వీసాలపై భారతీయ అమెరికన్ షాకింగ్ పోస్టు.. జనాల గగ్గోలు

Read Latest and NRI News

Updated Date - May 23 , 2025 | 07:50 PM