Share News

Dhim TANA: లాస్ ఏంజెలెస్‌లో ధీమ్‌ తానా-2025 పోటీలు విజయవంతం

ABN , Publish Date - Jun 24 , 2025 | 01:23 PM

జులైలో జరగనున్న తానా మహాసభలను పురస్కరించుకుని అమెరికాలోని వివిధ నగరాల్లో తానా పోటీలు జరుగుతున్నాయి. తాజాగా లాస్ ఏంజెలెస్‌లోని నిర్వహించిన ధీమ్ తానా పోటీలు వైభవంగా జరిగాయి.

Dhim TANA: లాస్ ఏంజెలెస్‌లో ధీమ్‌ తానా-2025 పోటీలు విజయవంతం
TANA 2025 Los Angeles

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ద్వైవార్షిక 24వ మహాసభలు జూలై 3, 4, 5 తేదీల్లో జరగనున్న సందర్భాన్ని పురస్కరించుకుని వివిధ నగరాల్లో ధీమ్‌ తానా (Dhim TANA competitions) పోటీలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా లాస్ ఏంజెలెస్‌లో నిర్వహించిన ధీమ్‌ తానా పోటీలకు మంచి స్పందన వచ్చింది.

ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన నందన్ పొట్లూరి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్లాసికల్ సోలో సింగింగ్‌, ఫిల్మీ సింగింగ్‌, గ్రూపు డ్యాన్స్‌ విభాగాలతో ప్రేక్షకులను అలరింపజేసింది. ఇందులో ముఖ్యంగా జూనియర్ కేటగిరీ, సబ్ జూనియర్ కేటగిరి పిల్లలు పాటలు, నృత్యాలతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశారు.2.jpg


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టాస్క్, లాటా, నాట్స్, ఆలంబన ఫౌండేషన్, ఏకం యూఎస్ఏ, లారా, తానా ప్రతినిధులు హాజరయి విజేతలకు మెడల్స్ అండ్ ట్రోఫీస్ బహుకరించారు.

ఈ కార్యక్రమ నిర్వహణలో లాస్ ఏంజెలెస్‌లో ఉన్న పలువురు తానా నాయకులు, లోకల్ ఆర్గనైజేషన్ నాయకులు పాల్గొని విజయవంతం చేశారు. పూర్వపు తాన రీజినల్ ప్రతినిధి, సురేష్ కందేపు మాట్లాడుతూ తానా టీం స్క్వైర్ గురించి వివరించారు. ప్రస్తుత తానా రీజినల్ ప్రతినిధి హేమ కుమార్ గొట్టి మాట్లాడుతూ ఈ కార్యక్రమం విజయవంతం కావటానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసారు.

3.jpg


5.jpg6.jpg7.jpg

ఇవీ చదవండి:

సీఎం సూచనతో విదేశాల్లో వెంకన్న మందిరాల నిర్మాణానికి కృషి: టీటీడీ ఛైర్మన్

అమెరికాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

Read Latest and NRI News

Updated Date - Jun 24 , 2025 | 03:43 PM