Share News

TANA: తానా త్రోబాల్‌, వాలీబాల్‌ పోటీలకు మంచి స్పందన

ABN , Publish Date - Jun 29 , 2025 | 01:20 PM

తానా మహాసభలను పురస్కరించుకుని తానా కాన్ఫరెన్స్‌ నిర్వాహకులు డెట్రాయిట్‌లో వివిధ ఆటల పోటీలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా నిర్వహించిన త్రోబాల్‌, వాలీబాల్‌ పోటీలు విజయవంతమయ్యాయి.

TANA: తానా త్రోబాల్‌, వాలీబాల్‌ పోటీలకు మంచి స్పందన
TANA 2025 Sports Events

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 24వ ద్వైవార్షిక మహాసభలు జూలై 3 నుంచి 5వ తేదీ వరకు డెట్రాయిట్‌ సబర్బ్‌ నోవైలో ఉన్న సబర్బన్‌ కలెక్షన్‌ షోప్లేస్‌లో నిర్వహించనున్నారు. ఈ మహాసభలను పురస్కరించుకుని డెట్రాయిట్‌లో వివిధ ఆటల పోటీలను తానా కాన్ఫరెన్స్‌ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా త్రోబాల్‌, వాలీబాల్‌ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో 500 మందికిపైగా పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు తమ క్రీడా ప్రతిభతో పలువురిని ఆకట్టుకున్నారు. ఈ పోటీల్లో విజేతలుగా డెట్రాయిట్‌ డ్రాగన్స్‌, డ్రేక్‌ చీతాస్‌, క్లీవ్‌ల్యాండ్‌ సెట్టర్స్‌, ఫార్మింగ్టన్‌ ఫైటర్స్‌ విజేతలుగా నిలిచారు.

2.jpg


పోటీల్లో భాగంగా నిర్వహించిన మెయిన్‌ విభాగంలో విజేతలుగా డెట్రాయిట్‌ డ్రాగన్స్‌, రన్నరప్‌గా డెట్రాయిట్‌ ఛాంప్స్‌ నిలిచాయి. తుషార, మోనీని వ్యక్తిగత క్రీడాకారులుగా ప్రకటించారు. బిగినర్స్‌ విభాగంలో విజేతలుగా డ్రేక్‌ చీతాస్‌, ఇంటర్మీడియట్‌ విభాగంలో విజేతలుగా క్లీవ్‌ల్యాండ్‌ సెట్టర్స్‌, రన్నరప్‌‌గా కూలీ పదై, అడ్వాన్స్‌డ్‌ విభాగంలో విజేతలుగా ఫార్మింగ్టన్‌ ఫైటర్స్‌, రన్నరప్స్‌‌గా నైట్‌ఫ్యూరీస్‌ నిలిచాయి. వ్యక్తిగత ప్రశంసలు టోనీ, శ్రీకాంత్‌‌లకు లభించింది.

ఈ సందర్భంగా విజేతలకు కాన్ఫరెన్స్‌ కోఆర్డినేటర్‌ ఉదయ్‌ కుమార్‌ చాపలమడుగు, డైరెక్టర్‌ సునీల్‌ పంట్ర, సెక్రటరీ కిరణ్‌ దుగ్గిరాల తదితరులు బహుమతులను అందించారు. డెట్రాయిట్‌ తెలుగు అసోసియేషన్‌ ఈ టోర్నమెంట్‌ నిర్వహణలో పాలుపంచుకుంది. ఈ టోర్నీని విజయవంతం చేసిన క్రీడాకారులందరికీ తానా నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు.

3.jpg


4.jpg5.jpg

ఇవీ చదవండి:

ఏపీ సీఎం నిర్ణయాలు దేశ ప్రగతికి మార్గదర్శకం: ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

కెనడాకు వెళ్లాలనుకునే వారు ఈ వీడియో చూడాలి.. దడ పుట్టిస్తున్న భారతీయ యువతి పోస్టు

Read Latest and NRI News

Updated Date - Jun 29 , 2025 | 01:36 PM