Smashers Badminton Tournament: సింగపూర్‌లో స్మాషర్స్ బ్యాడ్మింటన్ గ్రూప్ టోర్నమెంట్ విజయవంతం
ABN , Publish Date - Jul 13 , 2025 | 04:40 PM
తెలుగు వారి కోసం స్మాషర్స్ బ్యాడ్మింటన్ గ్రూప్ సింగపూర్‌లో ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజయవంతమైంది.
సింగపూర్, జూలై 8, 2025: స్మాషర్స్ బ్యాడ్మింటన్ గ్రూప్ సింగపూర్-2025 ఆధ్వర్యంలో తెలుగు సంఘానికి ప్రత్యేకంగా నిర్వహించిన బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ కల్చరల్ సొసైటీ అధ్యక్షులు రమేష్ గడపా, శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు, కార్యవర్గ సభ్యుడు శ్రీధర్ భరద్వాజ్, తెలుగు సమాజం నుంచి నాగేశ్ టేకూరి మద్దతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
భారత రాయబార కార్యాలయం నుంచి వీఎస్ఆర్ కృష్ణ, సన్యమ్ జోషి ఉత్సాహభరిత భాగస్వామ్యం ఈ కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.
ఈ టోర్నమెంట్‌లో మొత్తం 40 జట్లు పాల్గొన్నాయి. అనుభవజ్ఞుల నుంచి ప్రారంభ దశలో ఉన్న వారి వరకు అందరూ తమ ప్రతిభను ప్రదర్శించారు. ప్రారంభ రౌండ్లు రౌండ్-రాబిన్ లీగ్ తరహాలో నిర్వహించగా, అనంతరం ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ నుండి నాక్ అవుట్ మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగాయి. తుది పోరులో అనూప్, విజయ్ జంట విజేతలుగా నిలిచారు.

ఈ టోర్నమెంట్‌ను విజయవంతం చేసేందుకు తోడ్పడిన స్పాన్సర్లకు నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా వీరా ఫ్లేవర్స్, సరిగమ, కుంభకర్ణ, ఫ్లింటెక్స్ కన్సల్టింగ్, ఈఆర్ఏ, ఈస్ట్ కోస్ట్ ఫిజియోథెరపీ సంస్థల సహకారం ఈ టోర్నమెంట్‌కు మరింత బలాన్ని చేకూర్చింది.
నిర్వాహకులు ద్వారకానాధ్ మిట్టా, నవీన్ మల్లం, మహేశ్వర చౌదరి కాకర్ల, సాయి కృష్ణ సేలం, రమేష్ గోర్తి, ఉమామహేశ్వర రావు తెలదేవర, వెమ్మెసెన కులశేఖర్ రీగన్, ప్రసాద్, చంద్రబాబు జొన్నారెడ్డి, విశ్వనాథ్ తదితరులు ఈ విజయంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
క్రీడా స్ఫూర్తిని, సాంఘిక సమైక్యతను, సాంస్కృతిక గౌరవాన్ని ప్రతిబింబించేలా ఈ టోర్నమెంట్ సాగింది. ఖచ్చితమైన ప్రణాళికతో, స్నేహపూర్వక ఉత్సాహభరిత వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమం అందరి మెప్పు పొందింది.

ఈ టోర్నమెంట్‌ను విజయవంతం చేసిన ఆటగాళ్లు, స్వచ్ఛంద సేవకులు, ప్రోత్సాహకులు, స్పాన్సర్లకు స్మాషర్స్ బ్యాడ్మింటన్ గ్రూప్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.





ఈ వార్తలనూ చదవండి:
అరాచకంపై అక్షర సమరం పుస్తకంలో జగన్ అరాచకాలను ఎండగట్టారు..
డల్లాస్‌లో ఎన్నారై టీడీపీ ఆత్మీయ సమావేశం.. పాల్గొన్న ఎమ్మెల్యే అరవిందబాబు