NRI: డల్లాస్‌లో ఎన్నారై టీడీపీ ఆత్మీయ సమావేశం.. పాల్గొన్న ఎమ్మెల్యే అరవిందబాబు
ABN , Publish Date - Jul 08 , 2025 | 09:46 PM
పల్నాడు జిల్లా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌లో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.
ఎన్నారై డెస్క్: పల్నాడు జిల్లా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌లో ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. జొన్నలగడ్డ, దొండపాడు, పాములపాడు, రావిపాడు, ముత్తనపల్లి, నరసరావుపేట, పల్నాడు జిల్లాకు చెందిన పలువురు ఎన్నారైలు పాల్గొన్నారు. నరసరావుపేట రూరల్ పార్టీ ప్రెసిడెంట్ బండారుపల్లి విశ్వేశ్వరరావు, ఎన్నారై టీడీపీ ప్రతినిధులు కేసీ చేకూరి, సుధీర్ చింతమనేని తదితరులు ప్రసంగించారు.

డాక్టర్ చదలవాడ మాట్లాడుతూ...కూటమి ప్రభుత్వం అభివృద్ధి-సంక్షేమం ప్రధాన అజెండాగా ముందుకెళుతోందని అన్నారు. తద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. వచ్చే 15-20 ఏళ్ళు కూటమి అధికారంలో ఉంటుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీ అభివృద్ధి దిశగా పయనిస్తోందని, నరసరావుపేటలో అనేక అభివృద్ధి పనులు ప్రారంభించామని తెలిపారు. నందమూరి తారక రామారావు, కోడెల శివప్రసాదరావుకి నివాళులు అర్పించారు.
ఈ వార్తలు చదవండి:
అరబ్బు దేశంలో ఆటోమొబైల్ ఇంజినీర్.. ఆంధ్రలో ఆదర్శ రైతుగా..
యూఎస్ఏలో ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం