Share News

Indian Origin Student Missing: భారత సంతతి విద్యార్థిని అదృశ్యమైన ఘటనలో కీలక మలుపు.. తల్లిదండ్రుల అభ్యర్థన ఏంటంటే..

ABN , Publish Date - Mar 18 , 2025 | 03:45 PM

డొమినికన్ రిపబ్లిక్ పర్యటనలో అదృశ్యమైన భారత సంతతి విద్యార్థిని సుధీక్ష కేసు కీలక మలుపు తిరిగింది. ఆమె మరణించినట్టు ప్రకటించాలంటూ పోలీసులను ఆమె తల్లిదండ్రులు కోరినట్టు మీడియాలో వార్తలు వెలువడ్డాయి.

Indian Origin Student Missing: భారత సంతతి విద్యార్థిని అదృశ్యమైన ఘటనలో కీలక మలుపు.. తల్లిదండ్రుల అభ్యర్థన ఏంటంటే..
Indian Origin Student Missing

ఇంటర్నెట్ డెస్క్: డొమినికన్ రిపబ్లిక్‌ దేశంలో అదృశ్యమైన భారత సంతతి యువతి కేసు కీలక మలుపు తిరిగింది. ఆమె చనిపోయినట్టు ప్రకటించాలంటూ యువతి తల్లిదండ్రులు పోలీసులను కోరినట్టు అమెరికా మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

అమెరికాలో గ్రీన్‌కార్డుపై ఉంటున్న భారత సంతతి యువతి సుధీక్ష కోనంకీ ఇటీవల సెలవుల కోసం కరీబియన్ ద్వీపదేశమైన డొమినికన్ రిపబ్లిక్‌కు వెళ్లి అదృశ్యమైంది. చివరిసారిగా ఆమె తన స్నేహితుడితో కలిసి సముద్రం తీరంలో నడుచుకుంటూ వెళ్లినట్టు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. తాము ఇద్దరం సముద్రంలోకి వెళ్లగా పెద్ద అల తమకు ఉక్కిరిబిక్కిరి చేసినట్టు అతడు చెప్పుకొచ్చాడు. ఆ తరువాత తామిద్దరం ఎలాగొలా ఒడ్డుకు చేరుకున్నామని, తనకు మెళకువ వచ్చి చూసే సరికి ఆమె కనిపించలేదని తెలిపారు.

మరోవైపు, యువతి మృతదేహం కూడా లభ్యం కాకపోవడంతో అనుమానాస్పద ఘటనగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సుధీక్షా ఆచూకీ కోసం ఇంటర్‌పోల్ పోలీసులు కూడా యెల్లో నోటీసు జారీ చేశారు.


Also Read: భారత సంతతి అమెరికా విద్యార్థిని అదృశ్యం.. రంగంలోకి ఇంటర్‌పోల్

ఈ నేపథ్యంలో తమ బిడ్డ మరణించినట్టుగా పరగిణించాలంటూ సుధీక్ష తల్లిండ్రులు లేఖ రాశారని డొమినికల్ రిపబ్లిక్ నేషనల్ పోలీసు ప్రతినధి పేర్కొన్నారు. అయితే, ఈ విషయమై యువతి కుటుంబసభ్యులు మాత్రం ఇంకా ఎటువంటి ప్రకటనా చేయలేదు.

ఇదెలా ఉంటే సుధీక్ష వెంట చివరిసారిగా కనిపించిన యువకుడు పాస్‌పోర్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు అతడిని ఆరు గంటల పాటు విచారించారు. స్థానిక లాయర్ సమక్షంలో అతడిని పోలీసులు మరోసారి ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నవారు.


Also Read: గ్రీన్‌కార్డుదారులపైనా పెరుగుతున్న తనిఖీలు.. ఎన్నారైల్లో మొదలైన గుబులు

అయితే, ఈ కేసులో యువకుడిని అనుమానితుడిగా చేర్చలేదు. అతడిపై ఎటువంటి అభియోగం కూడా మోపలేదని తెలుస్తోంది. అయితే, అతడి పాస్‌పోర్డు ఎందుకు స్వాధీనం చేసుకున్నారన్నదానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

తమ కూతురు అదృశ్యమైన ఘటనలో ఎటువంటి కుట్ర కోణం లేదంటూ సుధీక్ష తల్లిదండ్రులు సోమవారం అధికారులకు లేఖ రాసినట్టు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఈ కేసులో అధికారుల విచారణపై తమకు విశ్వాసం ఉన్నట్టు కూడా వారు పేర్కొన్నారు.

Also Read: గల్ఫ్ దేశాలలో ఘనంగా జనసేన ఆవిర్భావ ఉత్సవాలు

Also Read: డిట్రాయిట్‌ వేదికగా తానా పండుగకు సన్నాహాలు ప్రారంభం

మరిన్ని ఎన్నారై వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 20 , 2025 | 12:17 PM