Janasena: గల్ఫ్‌కు త్వరలో జనసేన బృందం
ABN , Publish Date - Aug 09 , 2025 | 06:45 PM
ఎన్నారైల సమస్యలను అధ్యయనం చేసేందుకు జనసేన బృందం గల్ఫ్ దేశాల్లో పర్యటించనుంది. ఈ పర్యటనలో మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా భాగమవుతారని జనసేన పార్టీ సౌదీ ప్రాంతీయ అధ్యక్షుడు తాటికాయల మురారి ఒక ప్రకటనలో తెలిపారు
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: గల్ఫ్ దేశాలలో ప్రవాసాంధ్రులు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేయడానికి జనసేన పార్టీ పక్షాన ఒక బృందాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పంపనున్నారని జనసేన నాయకులు, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.
ఇటీవల తెనాలిలో తనను కలిసిన సౌదీ అరేబియాలోని జనసేన సెంట్రల్ ప్రాంత ప్రతినిధులతో ఈ విషయాన్ని నాదెండ్ల మనోహర్ వెల్లడించారని జనసేన పార్టీ సౌదీ ప్రాంతీయ అధ్యక్షుడు తాటికాయల మురారి ఒక ప్రకటనలో తెలిపారు. గల్ఫ్ దేశాల అధ్యయన బృందంలో నాదెండ్ల మనోహర్ కూడా ఉంటారని ఆయన అన్నారు.
సౌదీ అరేబియాలో జనసేన చేపడుతున్న పార్టీ బలోపేత చర్యలు, సంక్షేమ కార్యక్రమాల గురించి తాము మంత్రి నాదెండ్ల మనోహర్‌కు వివరించినట్లుగా మురారి చెప్పారు. ప్రతి శుక్రవారం లేబర్ క్యాంపుల సందర్శన ద్వారా పార్టీ ఉద్దేశాలను తాము ప్రచారం చేస్తున్నామని మురారి మనోహర్‌కు వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఏపీ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావుకు యూఎస్ఏలో సత్కారం
పీ-4 పథకానికి ప్రవాసీయులు ముందుకు రావాలి: చంద్రబాబు