Dr. Haranath Policherla: ప్రముఖ ఎన్నారై వైద్యుడు డా. పొలిచెర్ల హరనాథ్‌కు పౌర సన్మానం
ABN , Publish Date - Jul 19 , 2025 | 03:04 PM
సామాజిక స్పృహ కలిగిన పలు చిత్రాలను రూపొందించిన కళాకారుడు, ఎన్నారై డాక్టర్ హరనాథ్ పొలిచెర్లను డెట్రాయిల్‌లో స్థానిక ఎన్నారైలు ఘనంగా సత్కరించారు.
ఎన్నారై డెస్క్: చిత్తూరు జిల్లాకు చెందిన ప్రముఖ ప్రవాసాంధ్ర వైద్యుడు, నిర్మాత, నటుడు, దర్శకుడు డెట్రాయిట్‌కు చెందిన డా. హరనాథ్ పొలిచెర్ల సామాజిక సేవలకు గాను ఆయనను స్థానిక ప్రవాస భారతీయులు బుధవారం ఘనంగా సత్కరించారు. డెట్రాయిట్‌లో ప్రముఖ న్యూరాలజిస్టుగా పేరుగాంచిన హరనాథ్ ఉచిత వైద్య సలహాలతో సేవా కార్యక్రమాలను నిర్వహించడమే గాక సమైక్యతాభావాన్ని పెంపొందించే సామాజిక స్పృహ కలిగిన చిత్రాలను రూపొందించినందుకు ఆయనకు మిషిగన్ రాష్ట్ర ప్రవాస భారతీయుల ఆధ్వర్యంలో ఈ సన్మానం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు పెద్దిబోయిన జోగేశ్వరరావు, సునీల్ పంత్ర, సునీల్ మర్రిలు తెలిపారు.
కీరవాణి తండ్రి శివ శక్తి దత్తా దర్శకుడిగా పరిచయమైన 'చంద్రహాస్ ' చిత్ర నిర్మాతగా, హీరోగా ఆయన అలరించారు. కామెడీ ఎంటర్‌టైనర్ 'వెన్నెల' చిత్ర నిర్మాతగా కూడా డా.పొలిచెర్ల పేరు గడించారు. ఇప్పటివరకు ఆయన 16 సినిమాలను రూపొందించారు. 2006లో వచ్చిన హోప్ చిత్రానికి అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు.
ఇక 200 మందికి పైగా పాల్గొన్న ఈ సన్మాన కార్యక్రమంలో వక్తలు ఆయన కళాభిరుచిని, సేవా దృక్పథాన్ని, జాతీయ భావాన్ని కొనియాడారు. కాట్రగడ్డ కృష్ణప్రసాద్, వెలగా శుభకర్, ఉప్పాల రాంగోపాల్, చుక్కపల్లి ప్రసాద్, గుబ్బల జ్ఞానేశ్వర్, కోగంటి ప్రతాప్, అమరనాథ్ గౌడ, మంతెన వెంకట్, రావి కుటుంబరావు, కోడూరు చలపతి, వినోద్ కుకునూర్, దాసరి శ్రీనివాస్, బచ్చు సుధీర్, దుగ్గిరాల కిరణ్, సేరి విజయ్, గింజుపల్లి మురళి, గోగినేని శ్రీనివాస, మారెంరెడ్డి సాగర్, జలిగామ ప్రసాద్, బొమ్మనవేణి మురళి, శ్రీధర్ పటేల్, జిన్నా కొండల్, చిత్తలూరి శ్రీనివాస్, బడ్డి అశోక్, సన్నీ రెడ్డి, గోపాల్ చామర్తి తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
అరాచకంపై అక్షర సమరం పుస్తకంలో జగన్ అరాచకాలను ఎండగట్టారు..
డల్లాస్‌లో ఎన్నారై టీడీపీ ఆత్మీయ సమావేశం.. పాల్గొన్న ఎమ్మెల్యే అరవిందబాబు