Share News

Kartika Vanabhojanalu: యూఏఈలో ‘తెలుగు తరంగిణి’ కార్తీక వనభోజనాలు

ABN , Publish Date - Nov 14 , 2025 | 01:45 PM

యూఏఈలో తెలుగు తరంగిణి సంస్థ ఆధ్వర్యంలో కార్తీక వన భోజనాలు వైభవంగా జరిగాయి. ప్రవాసీయుల్లో భక్తి, సంప్రదాయం, ఆనందం అనే త్రివేణీ సంగమాన్ని తెలుగు తరంగిణి ఈ కార్యక్రమంలో మరోసారి ఆవిష్కరించింది.

Kartika Vanabhojanalu: యూఏఈలో ‘తెలుగు తరంగిణి’ కార్తీక వనభోజనాలు

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: దుబాయ్‌తో సహా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని తెలుగు కుటుంబాలలో కార్తీక మాసం వనభోజనాలకు శ్రీకారం చుట్టి దశాబ్దకాలం పూర్తయిన సందర్భంగా తెలుగు తరంగిణి ప్రవాసీ సంఘం ఇటీవల నిర్వహించిన కార్తీక వనభోజనాలతో ఎడారినాట ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.

ఉసిరి, తులసి, రవి, బిల్వ, జమ్మి తదితర దేవతా వృక్షాల నడుమ ప్రకృతి ఒడిలో దీపారాధన, శ్లోక పఠనం, వేదమంత్రాలతో పూర్తిగా సంప్రదాయబద్ధంగా రస్ అల్ ఖైమాలో ఈ కార్యక్రమం జరిగింది. దుబాయ్, షార్జా, ఇతర ఎమిరేట్ల నుండి వచ్చిన అనేక తెలుగు కుటుంబాలు కార్యక్రమంలో పాల్గొని భక్తితో పరవశించిపోయాయి. ప్రవాసీయుల్లో భక్తి, సంప్రదాయం, ఆనందం అనే త్రివేణీ సంగమాన్ని తెలుగు తరంగిణి ఈ కార్యక్రమంలో మరోసారి ఆవిష్కరించింది. తమ కుటుంబసభ్యుల వద్దకు సందర్శక వీసాలపై వచ్చిన కొందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరాయిదేశంలో సంపూర్ణ తెలుగు వాతావరణంలో శాస్త్రోక్త సంప్రదాయరీతిలో వనభోజనాలలో పాల్గొనడం నమ్మలేనట్లుగా ఉందని విజయనగరం నుండి వచ్చిన గంపిన కృష్ణకుమార్ గుప్తా, వెంకట గౌరి సుహాసినిలు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దీపోత్సవ పోటీలలో విజేతలకు వెండి పూజా సామగ్రిని బహుమతులుగా అందించారు.

6.jpg


2026 జనవరి 11న యూఏఈలో ప్రప్రథమంగా ఉచితంగా నిర్వహించే శ్రీ వేంకటేశ్వర కళ్యాణ సన్నాహాల గురించి నిర్వాహకులు ఈ సందర్భంగా వివరించారు. కళ్యాణోత్సవంలో పాల్గొనే వారికి లక్కీ డ్రా ద్వారా ఉచిత టిక్కెట్లను అందించారు. యూఏఈలో ప్రప్రథమంగా వేంకటేశ్వర కళ్యాణోత్సవాన్ని ఉచితంగా భక్తులకు అందించడానికి శ్రీకారం చుట్టిన తెలుగు తరంగిణి బృందాన్ని సభికులు ప్రశంసించారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన తెలుగు తరంగిణి కార్యవర్గ సభ్యులైన చిరతనగండ్ల శ్రీనివాస్, చామర్తి రాజేష్, నల్లనాగుల బ్రహ్మ, దిరిసాల ప్రసాద్, కొనకల్ల వీర, మట్టుపల్లి కేదార్, చిలుకూరు విజయ్, రాఘవరాజు కిరణ్, డా. రాఘవేంద్ర కుమ్మర, యెల్చూరి శరత్, కృష్ణాపురం శివానందం , పుప్పల వీరేంద్ర, నందమూరి రవి, కోక నందలను తెలుగు తరంగిణి అధ్యక్షులు వక్కలగడ్డ వెంకట సురేష్ కొనియాడారు. అందర్నీ సమన్వయం చేస్తూ ప్రతి సందర్భాన్ని తనదైన శైలిలో వివరిస్తూ సురేఖ పట్నం వ్యాఖ్యాతగా వ్యవహరించిన తీరు కూడా అందరి మన్ననలను అందుకుంది. దీపాల అలంకరణ పోటీ, ఫ్యాన్సీ డ్రెస్సు పోటీ, మ్యూజికల్ చెయిర్స్, మహిళలు, చిన్నారుల కోసం వినోదాత్మక ఆటలు, అందరినీ ఉత్సాహపరిచిన తంబోలా ఈవెంట్‌లలో విజేతలకు ప్రత్యేక బహుమతులను నిర్వాహకులు అందజేశారు.

1.jpg2.jpg4.jpg3.jpg


ఇవీ చదవండి

పాకిస్థానీలకు 59 రోజుల్లో కెనడా వీసా దరఖాస్తు ప్రాసెసింగ్.. భారతీయులకు మాత్రం..

ఖతర్‌లో ఆత్మీయత, ఆప్యాయతల మధ్య ఆంధ్ర కళా వేదిక కార్తీక వనభోజనాలు

Read Latest and NRI News

Updated Date - Nov 14 , 2025 | 01:58 PM