US Trade War: అమెరికాతో వాణిజ్య యుద్ధం ఇండియాకు మంచిది: రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి రాజశేఖర్
ABN , Publish Date - Aug 11 , 2025 | 02:47 PM
అమెరికాతో వాణిజ్య యుద్ధం భారత్‌కు లాభం చేకూరుస్తుందని రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి రాజశేఖర్ అన్నారు. డల్లాస్ పర్యటన సందర్భంగా ఆదివారం అక్కడి ప్రవాసులతో సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాతో వాణిజ్య యుద్ధం ద్వారా భారత్‌కు మంచి లాభమని విశ్రాంత ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి చింతపల్లి రాజశేఖర్ అభిప్రాయపడ్డారు. ఆదివారం డల్లాస్ పర్యటనలో భాగంగా ఇర్వింగ్‌లో ఆయన ప్రవాసులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాంగ విధానాల వలన రెండు దేశాల మధ్య భద్రత, సమృద్ధి అనే అంశాలకు ప్రాధాన్యత లభిస్తుందని పేర్కొన్నారు. ట్రంప్ ఆంక్షల కారణంగా చైనా భారత్‌కు స్నేహహస్తం చూపుతుందని తద్వారా మనకు అపార వాణిజ్య అవకాశాలు లభిస్తాయని తెలిపారు. రెండు మూడు దశాబ్దాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇండియా శాసిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం ఇటీవల చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై ఆయన అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో హరిహర పీఠం నిర్వాహకుడు సుబ్రహ్మణ్య శర్మ, కేసీ చేకూరి, చింతమనేని సుధీర్, కొల్లా అశోక్‌బాబు, వీరవల్లి శ్రీనివాస్, కాజా చందు, జిల్లెళ్లమూడి వెంకట్, పవన్, కిరణ్, మనోహర్, చుంచు రాఘవ, బాబు తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఏపీ గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావుకు యూఎస్ఏలో సత్కారం