Share News

Flower Cultivation: ఆ పూల అందాల వెనుక

ABN , Publish Date - Jul 27 , 2025 | 03:47 AM

బాపట్ల జిల్లా పరిధిలోని బాపట్ల, చీరాల మండల ప్రాంతాలకు చెందిన మల్లె, కనకాంబరాల పూలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అక్కడ వందల ఎకరాల్లో పూల సాగు జరుగుతోంది. ఆ నేల ఆ పూల పెరుగుదలకు అనుకూలం. అందుకే ఆ ప్రాంతంలో వాటిని సాగుచేయటం...

Flower Cultivation: ఆ పూల అందాల వెనుక

హైదరాబాద్‌, తిరుపతి, విశాఖపట్నం... ఇలా ఏ నగరాన్నయినా తీసుకోండి. అక్కడ మార్కెట్లో మల్లెపూలు, కనకాంబరాలు కళకళలాడుతూ ఉంటాయి. ప్రతి రోజూ ఇళ్లలో పూజలు, శుభకార్యాల కోసం, అలాగే అందమైన జడల్లోకి అలంకరణల కోసం ఆ పూలు ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఆ పూల సాగు వెనక ఎంత కష్టం ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఒకప్పుడు ఎక్కడ పండిన పూలు ఆ ప్రాంతంలోనే లభించేవి. కానీ రవాణా వ్యవస్థ మెరుగుపడిన తర్వాత పూల సువాసనకు సరిహద్దులు చెరిగిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో... కొన్ని వందల ఎకరాల్లో మల్లె, కనకాంబరం పూలు సాగవుతున్నాయి. వాటి కథేమిటంటే...

బాపట్ల జిల్లా పరిధిలోని బాపట్ల, చీరాల మండల ప్రాంతాలకు చెందిన మల్లె, కనకాంబరాల పూలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అక్కడ వందల ఎకరాల్లో పూల సాగు జరుగుతోంది. ఆ నేల ఆ పూల పెరుగుదలకు అనుకూలం. అందుకే ఆ ప్రాంతంలో వాటిని సాగుచేయటం సంప్రదాయంగా వస్తోంది. సాధారణంగా మల్లె, కనకాంబరాల మొక్కలు పదేళ్ల పాటు పువ్వులు పూస్తాయి. వీటి దిగుబడి వేసవిలో అధికంగా, శీతాకాలంలో ఒక మోస్తరుగా ఉంటుంది. వీటి డిమాండ్‌ కాలాలపై ఆధారపడి ఉంటుంది. వేసవిలో పూలు ఎక్కువగా అందుబాటులో ఉంటాయి కాబట్టి ధర తక్కువ ఉంటుంది. హోల్‌సేల్‌లో ఒక క్వింటాల్‌ పూల ధర 40 వేల రూపాయల దాకా ఉంటుంది. వర్షాకాలంలో ఈ ధర గణనీయంగా పెరుగుతుంది. శ్రావణ మాసం వచ్చేసరికి క్వింటాల్‌ రూ.75 వేల వరకూ చేరుతుంది.


01-navya.jpg

స్థానికంగా ఉపాధి...

ఒకసారి మొక్క బలంగా నాటుకున్న తర్వాత చీడ పీడలు రాకుండా మందులకు అయ్యే ఖర్చు మాత్రమే ఉంటుంది. దీనితో రైతుకు ఎక్కువ ఆదాయమే వస్తుంది. ‘‘ఈ పంట సాగు విషయంలో మాకు పెద్ద సమస్యలు ఉండవు. కానీ కొన్నిసార్లు ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడతాయి. ఉదాహరణకు ఎక్కువ వానలు పడినప్పుడు పూలను కోయటానికి వీలు కాదు. పండగలు, శ్రావణ మాసం లాంటి సమయాల్లో ఎక్కువ డిమాండ్‌ ఉంటుంది. కానీ అప్పుడు తగినన్ని పూలు అందుబాటులో ఉండవు. ఎక్కువ పూలు అందుబాటులోకి వచ్చే సమయానికి ధర పడిపోతుంది. అయితే ఏడాది మొత్తం సగటు ధర తీసుకుంటే లాభదాయకంగానే ఉంటుంది’’ అంటున్నారు ఈ పంటను సాగుచేస్తున్న కోట వెంకటలక్ష్మి. అయితే ఈ పూల సాగుదారులకు ప్రత్యేకంగా ప్రభుత్వ పథకాలేవీ లేవు. ‘‘మాకు ప్రత్యేక పథకాలు కల్పిస్తే అనేకమంది ఈ పూలను పండించటానికి ముందుకు వస్తారు. అప్పుడు ఇతర రాష్ట్రాలకు కూడా పూల ఎగుమతి పెంచవచ్చు’’ అని ఆమె చెబుతున్నారు. ఇక... సాధారణంగా పూలు కోసే పని స్థానిక మహిళలే చేస్తూ ఉంటారు. చూడటానికి ఈ పని తేలికగానే కనిపిస్తుంది. కానీ రోజంతా వంగి పూలు కోయటం వెనుక చాలా శ్రమ ఉంటుందంటారు వ్యవసాయ కూలీలు. ‘‘పూల దండలు కట్టడం ఒక కళ. అది చాలామందికి సహజంగానే వస్తుంది. అది పెద్ద శ్రమ అనిపించదు. కానీ ప్రతిరోజూ వేల పువ్వులను కోయటం అంత సులువు కాదు. కానీ ఇల్లు గడవాలంటే తప్పదు మరి’’ అంటున్నారు మరో సాగుదారైన చందన.

- తాళ్లూరి ప్రదీప్‌, చీరాల

మొక్క నుంచి కోసిన తర్వాత చల్లటి వాతావరణంలో ఉంచితే- మల్లె మొగ్గలు మూడు నుంచి నాలుగు రోజుల వరకు తాజాగా ఉంటాయి. కనకాంబరాలు అయితే ఒక రోజు మాత్రమే నిల్వ ఉంటాయి. కోసిన తర్వాత మల్లెపూలను మార్కెట్‌కు చేరుస్తారు. అక్కడి నుంచి అన్ని నగరాలకు చేరుకుంటాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన షెడ్యూల్ ఖరారు

లొంగిపోయిన అగ్ర మావోయిస్టులు.. డీజీపీ ఏమన్నారంటే..

Read latest AP News And Telugu News

Updated Date - Jul 27 , 2025 | 03:48 AM