Share News

Winter Health Tips: చలికాలం వ్యాధులకు దూరంగా

ABN , Publish Date - Nov 25 , 2025 | 02:16 AM

బోన్‌ సూప్‌, వెజిటబుల్‌ సూప్‌లు శరీరానికి అవసరమైన ఖనిజలవణాలనూ, అమీనో ఆమ్లాలనూ సమకూర్చి, వ్యాధినిరోధకశక్తిని పెంచుతాయి...

Winter Health Tips: చలికాలం వ్యాధులకు దూరంగా

సీజనల్‌ కేర్‌

సూప్‌: బోన్‌ సూప్‌, వెజిటబుల్‌ సూప్‌లు శరీరానికి అవసరమైన ఖనిజలవణాలనూ, అమీనో ఆమ్లాలనూ సమకూర్చి, వ్యాధినిరోధకశక్తిని పెంచుతాయి.

జలుబు, జ్వరం: దంచిన వెల్లుల్లి, తేనె కలిపిన మిశ్రమం శక్తివంతమైన సహజసిద్ధ విరుగుడుగా పని చేస్తుంది. జలుబు, జ్వరం, ఇన్‌ఫెక్షన్లు వేధించినప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే వీటి నుంచి ఉపశమనం కలుగుతంది

ఉబ్బసం: వేడి పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగడం వల్ల ఉబ్బసం, దగ్గు, జలుబుల నుంచి ఊరట కలుగుతుంది

నిమ్మరసం: పరగడుపున గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల విషాలు బయటకు వెళ్లిపోయి, జీర్ణశక్తి, వ్యాధినిరోధకశక్తి మెరుగవుతాయి

ముక్కు దిబ్బెడ: వేడి నీళ్లలో యూకలిప్టస్‌, పెప్పర్‌మింట్‌ నూనెలు కలిపి ఆవిరి పడితే, ముక్కు దిబ్బెడ వదులుతుంది. శ్వాసకోస నాళాలు తెరుచుకుని, శ్వాస ఇబ్బంది సమస్య తొలగిపోతుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

ఈఎస్ఐ ఆసుపత్రిలో ప్రమాదం.. ముగ్గురు మృతి

సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు.. ఆ రోజు ఇలా చేయండి..

For More TG News And Telugu News

Updated Date - Nov 25 , 2025 | 02:16 AM