Winter Makeup Tips: చల్లని వేళ చమక్కుమనేలా
ABN , Publish Date - Nov 17 , 2025 | 06:01 AM
చలి కాలం చర్మం పొడిబారిపోయి, నిర్జీవంగా తయారవుతుంది. ఇలాంటి చర్మం జీవం ఉట్టిపడేలా మారాలంటే చలికాలానికి తగిన మేకప్ చిట్కాలు పాటించాలి. అవేంటంటే....
మేకప్
చలి కాలం చర్మం పొడిబారిపోయి, నిర్జీవంగా తయారవుతుంది. ఇలాంటి చర్మం జీవం ఉట్టిపడేలా మారాలంటే చలికాలానికి తగిన మేకప్ చిట్కాలు పాటించాలి. అవేంటంటే..
చర్మాన్ని సిద్ధం చేసి : సున్నితమైన ఫేస్‌వాష్‌తో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఇలాంటి ఫేస్‌వా్‌షతో చర్మం పొడిబారిపోకుండా ఉంటుంది. ఆ తర్వాత స్క్రబర్‌తో మృతకణాలను తొలగించుకోవాలి.
మాయిశ్చరైజర్ : మేక్‌పకు ముందు నాణ్యమైన హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి.
హైడ్రేటింగ్ ప్రైమర్ : నాణ్యమైన ప్రైమర్ మేక్‌పను ఎక్కువ సమయం పాటు చెక్కుచెదరకుండా ఉంచుతుంది. అలాగే నునుపుగా మలుస్తుంది. కాబట్టి ప్రత్యేకించి చలికాలంలో మ్యాట్ ప్రైమర్‌కు బదులుగా, హైడ్రేటింగ్ ప్రైమర్‌ను ఎంచుకోవాలి. దీన్ని వాడుకోవడం వల్ల, తర్వాత అప్లై చేసుకునే ఫౌండేషన్‌తో ముఖం మీద గీతలు ఏర్పడకుండా ఉంటాయి. ఫౌండేషన్‌లో పగుళ్లు ఏర్పడకుండా ఉంటాయి. ఒకవేళ చర్మం మరింత పొడిబారినట్టు అనిపిస్తే, ప్రైమర్‌లో కొన్ని చుక్కల ఫేసియల్ ఆయిల్ కలుపుకోవాలి.
తగిన ఫౌండేషన్ : చలికాలం పౌడర్ ఆధారిత ఫౌండేషన్లను వాడుకోకూడదు. బదులుగా ద్రవ రూపంలోని లేదా క్రీమ్ ఆధారిత ఫౌండేషన్‌ను ఎంచుకోవాలి. వీటితో చర్మం అదనపు మెరుపును సంతరించుకుంటుంది. అలాగే అవసరానికి మించిన మ్యాట్ ఫిని్‌షతో చర్మం పొడిగా, నిర్జీవంగా మారుతుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఫౌండేషన్‌ను చర్మం మీద సమంగా అద్దుకుని, బ్యూటీ స్పాంజ్ తో ముఖమంతా సమంగా పరుచుకోవాలి.
కన్‌సీలర్ : కళ్ల దిగువన, మచ్చల మీద కన్‌సీలర్ అప్లై చేసుకుని, చర్మంలో కలిసిపోయేలా బ్లెండ్ చేయాలి. సాధారణంగా కొంతమంది మచ్చలను మాయం చేయాలనే ఆలోచనతో అవసరానికి మించి కన్‌సీలర్లను వాడుకుంటూ ఉంటారు. కానీ ఇలా చేయడం వల్ల మచ్చల స్థానంలో తెల్లని మచ్చలు ఏర్పడతాయి. మేకప్ పూర్తయిన తర్వాత స్పష్టంగా కనిపించే ఈ తెల్ల మచ్చలను సరిదిద్దడం కష్టం కాబట్టి కన్‌సీలర్‌ను ఆచితూచి అప్లై చేసుకోవాలి.
బ్లష్ : క్రీమ్ ఆధారిత బ్లష్‌ను ఎంచుకోవాలి. దీంతో సహజసిద్ధ రంగు సమకూరుతుంది. చీక్‌బోన్స్‌ను బ్లష్‌తో హైలైట్ చేసుకుంటే బుగ్గలు గులాబీల్లా కనిపిస్తాయి
ఇవి కూడా చదవండి..
కుటుంబంలో చిచ్చుపెట్టిన ఎన్నికల ఫలితాలు.. లాలూ కూతురి వరుస పోస్టులు..
లాలూ ఇంటిని వీడిన మరో ముగ్గురు కుమార్తెలు
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.