Share News

Plant Maintenance Tips: ఇండోర్‌ ప్లాంట్స్‌ ఇలా

ABN , Publish Date - Oct 30 , 2025 | 02:31 AM

ఇంటి అందాన్ని పెంచడంలో ఇండోర్‌ ప్లాంట్స్‌ ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. అందుకే చాలామంది వీటిని ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు. చలికాలంలో ఇండోర్‌ ప్లాంట్స్‌కు ప్రత్యేక సంరక్షణ అవసరమని...

Plant Maintenance Tips: ఇండోర్‌ ప్లాంట్స్‌ ఇలా

ఇంటి అందాన్ని పెంచడంలో ఇండోర్‌ ప్లాంట్స్‌ ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. అందుకే చాలామంది వీటిని ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు. చలికాలంలో ఇండోర్‌ ప్లాంట్స్‌కు ప్రత్యేక సంరక్షణ అవసరమని నిపుణులు చెబుతున్నారు.

ఆ వివరాలు...

  • చలికాలంలో ఇండోర్‌ ప్లాంట్స్‌కు రోజూ నీళ్లు పోయనవసరం లేదు. కుండీలోని మట్టి పొడిబారినప్పుడు మాత్రమే కొద్దిగా నీళ్లు చిలకరించాలి. మొక్క తత్వాన్ని అనుసరించి నీళ్లు పోయాలి. అవసరానికి మించి నీళ్లు పోస్తే మొక్కలకు తెగుళ్లు వచ్చే ప్రమాదం ఏర్పడుతుంది.

  • చలికాలంలో గాలి చాలా పొడిగా ఉంటుంది. దీనివల్ల మొక్కలు తేమను కోల్పోతూ ఉంటాయి. కుండీలో చిన్న నీళ్ల గిన్నెను ఉంచితే నీరు ఆవిరిగా మారి చుట్టూ ఉన్న గాలిలో తేమను పెంచుతుంది. దీంతో మొక్కలు కూడా ఆరోగ్యంగా పెరుగుతాయి.

  • రోజూ కుండీలను కొద్దిసేపు ఎండలో ఉంచడం మంచిది. ఎండ రాని రోజుల్లో ఇంట్లో గ్రో లైట్లను వేయడం వల్ల మొక్క అవసరాలు తీరతాయి.

  • చలికాలంలో మొక్కల ఎదుగుదల తక్కువగా ఉంటుంది. కాబట్టి వాటికి ఎరువులు అందించనవసరం లేదు. ఒకవేళ ఎరువులు వేసినప్పటికీ మొక్కలు పోషకాలను గ్రహించలేవు. కాబట్టి చలికాలమంతా మొక్కలను విశ్రాంతిగా ఉంచడం మేలు.

  • ఆకుల మీద దుమ్ము, ధూళి పేరుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వారానికి రెండుసార్లు ఆకులను తడిగుడ్డతో తుడవడం మంచిది.

  • పండిన, ఎండిన ఆకులను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండాలి. అదనంగా పెరిగిన కొమ్మలను కత్తిరిస్తే మొక్క శక్తి సద్వినియోగమవుతుంది.

  • చలికాలంలో మొక్కలకు కుండీలను మార్చకూడదు. అలాచేస్తే మొక్కలు బలహీనమవుతాయి. దానికి బదులు కొత్త కుండీలో కొత్త విత్తనాలు చల్లుకోవచ్చు.

ఇవి కూడా చదవండి:

కూతురికి ఈత నేర్పిస్తుండగా విషాదం.. 5 రోజుల తర్వాత..

మొంథా తుఫాను ఎఫెక్ట్.. పాఠశాలలకు సెలవు

Bhatti Vikramarka: ఓవర్సీస్ స్కాలర్‌షిప్ బకాయిలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Azharuddin: తెలంగాణ కేబినెట్‌లోకి అజారుద్దీన్.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేది ఎప్పుడంటే..

Updated Date - Oct 30 , 2025 | 02:31 AM