ఫ్లాస్క్ శుభ్రం చేయకపోతే
ABN , Publish Date - Jun 05 , 2025 | 06:01 AM
మనం కార్యాలయాలకు లేదా దూరప్రాంతాలకు వెళ్లేటప్పుడు పాలు, కాఫీ, టీ లాంటి వాటిని ఫ్లాస్క్‌లో పోసుకుని తీసుకువెళుతూ ఉంటాం. ఈ ఫ్లాస్క్ మూత బిగుతుగా ఉండి...
మనం కార్యాలయాలకు లేదా దూరప్రాంతాలకు వెళ్లేటప్పుడు పాలు, కాఫీ, టీ లాంటి వాటిని ఫ్లాస్క్‌లో పోసుకుని తీసుకువెళుతూ ఉంటాం. ఈ ఫ్లాస్క్ మూత బిగుతుగా ఉండి లోపలి పానీయం ఎక్కువ సమయం వేడిగా లేదా చల్లగా ఉండేలా చేస్తుంది. ఇలా ఉపయోగించుకున్న తరవాత ఆ ఫ్లాస్క్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. లేని పక్షంలో దాని లోపల హానికారక ఫంగస్ పెరిగి దుర్వాసన వస్తుంది. కనుక...
ముందుగా ఫ్లాస్క్‌లో నీళ్లు పోసి వంచేయాలి. తరవాత దాని నిండా గోరువెచ్చని నీళ్లు పోసి ఉంచాలి. అరగంట తరవాత ఈ నీళ్లు వంచేసి పొడవాటి బ్రష్‌తో సున్నితంగా రుద్ది కడగాలి. అలాగే మూతను కూడా కడిగి రెంటినీ పూర్తిగా ఆరనివ్వాలి. తరవాత ఫ్లాస్క్‌కు మూత బిగించి భద్రపరచుకోవాలి.
ఫ్లాస్క్ నుంచి కాఫీ లేదా టీ వాసన ఎక్కువగా వస్తూ ఉంటే దాని నిండా గోరువెచ్చని నీళ్లు నింపాలి. అందులో రెండు చుక్కల డిష్ వాషింగ్ లిక్విడ్, అర చెంచా బేకింగ్ సోడా, చెంచా వెనిగర్‌లలో ఏదో ఒకటి వేసి బాగా కలపాలి. పది నిమిషాల తరవాత ఆ నీళ్లు వంచేసి బ్రష్‌తో రుద్దాలి. వెంటనే మంచినీళ్లతో కడిగి ఆరబెడితే ఎలాంటి వాసనైనా తొలగిపోతుంది.
రాత్రి పడుకునే ముందు ఫ్లాస్క్‌లో వాడేసిన టీ బ్యాగ్ లేదా ఒక చెంచా బియ్యం లేదా ఒక చెంచా ఉప్పు వేసి దాని నిండా నీళ్లు నింపి మూత పెట్టాలి. ఉదయాన్నే ఫ్లాస్క్‌ను రెండు నిమిషాలపాటు వేగంగా అటూ ఇటూ ఊపాలి. తరవాత ఆ నీళ్లు వంచేసి మంచినీళ్లతో కడిగి ఆరబెట్టాలి. లేదంటే వెంటనే వాడుకోవచ్చు.
ఫ్లాస్క్ మూతకి రబ్బర్ సీల్ ఉంటే దాన్ని తీసి లిక్విడ్ సోప్‌తో శుభ్రం చేయాలి. మెత్తని స్పాంజ్‌తో రుద్ది కడగాలి.
For AndhraPradesh News And Telugu News