Share News

Parenting Tips: పిల్లలకు ఇవి నేర్పించాలి..

ABN , Publish Date - Apr 21 , 2025 | 03:50 AM

పిల్లలకు చిన్నతనం నుంచే ఇంటిపనులు చేయడం నేర్పితే బాధ్యతతో పాటు ఆత్మవిశ్వాసం, సహకార భావన అభివృద్ధి చెందుతుంది. ఇదివల్ల వారు సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు.

Parenting Tips: పిల్లలకు ఇవి నేర్పించాలి..

పిల్లలు బడిలో చదువుతున్నప్పుడే... తల్లిదండ్రులు వాళ్లకి చిన్న చిన్న ఇంటిపనులు చేయడం నేర్పించాలి. దీనివల్ల పిల్లలకు బాధ్యత, సహాయం చేయడం, ఆత్మవిశ్వాసం, విచక్షణా జ్ఞానం, సంఘటిత శక్తి విలువ అవగతమవుతాయి. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు దాన్ని పరిష్కరించుకునే సామర్థ్యం అలవడుతుంది.

పిల్లలకు చిన్నతనంలోనే నేర్పించాల్సిన పనులు ఇవే...

కూరగాయలు కడగడం-కోయడం, మసాలా దినుసుల వివరాలు- వాటి వినియోగం, వంటగది గట్టు తుడవడం, భోజనం వడ్డించడం, పాత్రలు కడగడం లాంటి పనులను పిల్లలకు చెప్పి చేయించాలి.

నిద్ర లేవగానే దుప్పట్లు మడతపెట్టడం, పరుపు సర్దడం, ఉతికిన బట్టలు ఆరవేయడం-మడతపెట్టడం, బీరువాలో బట్టలు సర్దడం నేర్పించాలి.

లైట్లు, ఫ్యాన్లు, టీవీ, సోఫా, అద్దం, ఇంట్లోని అలంకరణ వస్తువులను దుమ్ము లేకుండా తుడవడం నేర్పించాలి.

ఇల్లు ఊడవడం, వ్యాక్యూమ్‌ క్లీనర్‌ను ఉపయోగించడం, చెత్తను పారిశుద్ద్య కార్మికులకు అందివ్వడం లాంటివి నేర్పించాలి.


న్యూస్‌ పేపర్లు, పుస్తకాలను అరల్లో సర్దడం చూపించాలి.

ఇంటికి కావాల్సిన కిరాణా సరుకుల లిస్ట్‌ రాయడం, బజారు నుంచి కూరగాయలు తీసుకురావడం లాంటివి నేర్పించాలి. ధరలు-నాణ్యతలపై అవగాహన కల్పించాలి

ఇంటికి వచ్చిన అతిథులను పలుకరించడం, ఆదరించడం, గౌరవించడం నేర్పించాలి.

టూత్‌బ్రష్‌లు, టూత్‌పేస్టు, షాంపూ, సబ్బులు తదితరాలను వినియోగించుకున్న తరవాత వాటిని యథాస్థానంలో ఉంచడం అలవాటు చేయాలి.

ఇంట్లో బూజులు దులపడం, మొక్కలకు నీళ్లు పోయడం, పరిసరాల్లో చెత్తచెదారం లేకుండా శుభ్రం చేయడం లాంటి పనులు నేర్పించాలి.


ఇవి కూడా చదవండి:

Ramesh Nagapuri: నేనే తప్పూ చేయలేదు.. సస్పెన్షన్‌పై రమేశ్ నాగపురి రియాక్షన్


Viral Video: వైద్యం కాదు వేధింపు..ప్రభుత్వ ఆస్పత్రిలో వృద్ధుడిని లాక్కెళ్లిన డాక్టర్, సిబ్బంది


Viral News: 70 ఇన్ స్పేస్..అంతరిక్షంలో రోదసీ యాత్రికుడి బర్త్ డే సెలబ్రేషన్

UPSC Recruitment: రూ.25తో ప్రభుత్వ ఉద్యోగానికి గ్రీన్‌సిగ్నల్.. 45 ఏళ్ల వారికీ కూడా ఛాన్స్


Scam Payments: మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్.. జర జాగ్రత్త..

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 21 , 2025 | 03:50 AM